Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

డ్యాన్స్‌ మాస్టర్‌లు సినిమా దర్శకులుగా మారడం కొత్తేం కాదు. ఇప్పుడు ఉన్న స్టార్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్లు చాలామంది ఇలా చేసినవారే. కొంతమంది హీరోలుగా మారాక దర్శకులు అయ్యారు. కొన్నాళ్లు వరుస సినిమాలు చేసి ఆ తర్వాత సినిమాలు తగ్గించేశారు. మరికొందరు ఒకట్రెండు సినిమాలు డైరెక్ట్‌ చేసి ఆ తర్వాత తిరిగి డ్యాన్స్‌ కొరియోగ్రఫీకి వచ్చేశారు. ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు మరో స్టార్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ మెగాఫోన్‌ పట్టబోతున్నారు. ఆయనే శేఖర్‌ మాస్టర్‌.

Shekar Master

టాలీవుడ్‌లో అగ్ర హీరోలకు, సీనియర్‌ అగ్ర హీరోలకు డ్యాన్స్‌ కొరియోగ్రఫీ చేస్తూ అదరగొడుతున్నారు శేఖర్‌ మాస్టర్‌. హీరోల బాడీ లాంగ్వేజ్‌ని బాగా పట్టుకొని డ్యాన్స్‌ చేయిస్తారని ఆయనకు పేరు. ఇప్పుడు అదే పట్టుతో డైరక్షన్‌ వైపు వస్తున్నారట. అయితే దర్శకత్వాన్ని స్టార్‌ హీరోలతో కాకుండా ఓ యంగ్‌ డెబ్యుటంట్‌తో చేయబోతున్నారట. ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌, హీరో, డైరెక్టర్‌ ప్ర‌భుదేవా కొడుకు రిషిల్ రాఘ‌వేంద్ర దేవాను శేఖర్‌ మాస్టర్‌ లాంచ్‌ చేయబోతున్నారట.

రిషిల్‌ కోసం శేఖ‌ర్ మాస్ట‌ర్ ఓ క‌థ సిద్ధం చేశారట. ఇటీవ‌ల ప్ర‌భుదేవాను క‌లసి క‌థ లైన్‌ కూడా చెప్పార‌ట. ‘ప్రేమికుడు’ సినిమా త‌ర‌హాలో మ్యూజిక్‌, డాన్స్ కలగలిపిన సినిమా ఇది అని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ త్వరలోనే ఉంటుంది అని చెబుతున్నారు. సమ్మర్‌లోనే ఈ సినిమా షూటింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశం ఉందని చెబుతున్నారు.

ప్రభుదేవా తలచుకుంటే తన తనయుడిని ఓ పెద్ద దర్శకుడి సినిమాతో లాంచ్‌ చేయొచ్చు. కానీ శేఖర్‌ మాస్టర్‌ చేతిలో పెడుతున్నారు. ఇక రిషిల్‌ సంగతికొస్తే.. డ్యాన్స్‌, నటన, ఫైట్స్‌ తదితర విషయాల్లో పూర్తి స్థాయి శిక్షణ పొంది సినిమాల్లోకి వస్తున్నాడట. మరి తండ్రిలా ఆల్‌రౌండర్‌ అనిపించుకుంటారో లేదో చూడాలి.

 

ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus