Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun) లాంటి హీరోతో ఓ యాడ్‌ షూట్ చేయాలంటే చాలా నిబంధనలు ఉంటాయంటూ బ్రాండ్‌ స్ట్రాటజర్‌ కావేరీ బారువా ఓ పాడ్ క్యాస్ట్ లో పాల్గొన్న టైమ్లో చెప్పుకొచ్చారు.ఆమె మాట్లాడుతూ.. “ఒక్కో సెలబ్రిటీకి ఒక్కో రకమైన వ్యక్తిత్వం ఉంటుంది. అల్లు అర్జున్‌ వల్ల నాకు ఊహించని అనుభవం ఎదురైంది. సౌత్ స్టార్స్ ప్రైవసీ కోసం చాలా మందిని పెట్టుకుంటారు అని నాకు అప్పుడే తెలిసొచ్చింది.

Allu Arjun

అల్లు అర్జున్‌ను కలిసే ముందు ఏకంగా 42 నిబంధనలు ఉంటాయని… అతని మేనేజర్ కి మేనేజర్ కి మేనేజర్ అయినటువంటి మేనేజర్ తెలిపారు. వాళ్ళు కూడా చాలా కఠినంగా ఉంటారు. ‘హీరోకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వొద్దు. సాధ్యమైనంత దూరం పాటించాలి. అతను సెట్‌లో ఉంటే మిగిలిన వాళ్ళు ఫోన్‌ వాడకూడదు’ వంటి చాలా నిబందనలు ఉంటాయి. ఓ యాడ్‌ షూటింగ్‌ టైమ్లో అల్లు అర్జున్‌ వస్తుండగా నేను సెట్‌లో ఎక్కడో చివర ఫోన్‌ చూసుకుంటూ కూర్చొన్నా.

అంతే, ఆయన టీమ్ మెంబర్ ఒకరు సడన్ గా వచ్చి నా ఫోన్ లాగేసుకున్నారు. ‘ఇక్కడ ఫోన్‌ వాడకూడదు అంటూ చెప్పాడు’ అన్నాడు. కానీ నా పని మీద నా ఫోన్ చూసుకుంటున్నాను.వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటో నాకు అర్దం కాలేదు. బహుశా హీరో ప్రైవసీకి భంగం కలగకూడదని అలా కఠినంగా వ్యవహరించరేమో’’ అంటూ కావేరీ బారువా చెప్పుకొచ్చింది.వాస్తవానికి ఆమె తన అభిప్రాయం చెప్పడంలో సందేహం లేదు.

కానీ అల్లు అర్జున్ కి కోపం వచ్చినట్టు ఉంది. ఆమె చెప్పిందంతా అబద్దం అని.. ఆమె పై పరువు నష్టం వేస్తామని హెచ్చరిస్తూ అల్లు అర్జున్ టీమ్ పేరిట ఓ లెటర్ రిలీజ్ అయ్యింది. అందులో ‘కావేరి చెప్పిందాంట్లో ఎలాంటి నిజం లేదని, ఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని, అల్లు అర్జున్‌ ఎప్పుడూ హుందాగా, గౌరవప్రదంగా ఉండే వ్యక్తని వెనకేసుకొచ్చింది. ఈ నిరాధార ఆరోపణలపై పరువునష్టం దావా వేసేందుకు తమ న్యాయ బృందం పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే ఆ వీడియోను షేర్ చేసేవారిపై కూడా చర్యలు తీసుకుంటామని కూడా అందులో పేర్కొంది.

‘అయితే ఈ మాత్రం దానికే లీగల్ యాక్షన్ తీసుకునే రేంజ్..కి వెళ్ళాలా?’ అంటూ సోషల్ మీడియాలో కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి కూడా ఓ కారణం ఉంది. కమర్షియల్స్ లో స్టార్స్ ఇన్వోల్వ్ అయినప్పుడు.. వాళ్ళు కూడా కొన్ని షరతులు పెడుతూ ఉంటారు. అందులో వ్యక్తిగత ప్రైవసీ కూడా ఒకటి. వాళ్ళు యే బ్రాండ్ కి అయితే సైన్ చేశారో.. దాని అధినేతలు మిగతా నటీనటులతో అగ్రిమెంట్లపై సైన్ చేయించుకుంటారు.

అక్కడి విషయాలు పబ్లిక్ గా చెబితే.. లీగల్ యాక్షన్ తీసుకునే అధికారం ఉంటుంది అని కూడా అందులో ఉంటుంది. బహుశా ఆ పాయింట్ మీదే అల్లు అర్జున్ టీమ్ కావేరీ పై యాక్షన్ తీసుకునే అవకాశం ఉండొచ్చు.

ఇళయరాజా బయోపిక్‌.. ఆయన సినిమా నుండి తప్పుకున్నాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus