Allu Arjun: వైజాగ్‌కి థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా..

  • February 8, 2023 / 12:55 PM IST

‘పుష్ప – ది రైజ్’.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌ని పాన్ ఇండియా స్థాయిలో ఐకాన్ స్టార్‌గా మార్చేసింది.. అప్పటి వరకు తెలుగులో అల్లు అర్జున్, మలయాళంలో మల్లు అర్జున్‌గా స్టార్ డమ్ ఉన్న బన్నీకి నార్త్‌‌లోనూ గుర్తింపుతో పాటు ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసింది.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సుకుమార్ వంటి బ్రిలియంట్ డైరెక్టర్ ఒకరున్నారని తెలిసేలా చేసింది.. 2021లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ మూవీగా రికార్డ్ సెట్ చేసింది.

బన్నీకి ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డ్ తెచ్చి పెట్టింది. రష్మిక మందన్న, అనసూయ, సునీల్, అజయ్ ఘోష్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి బ్యాక్ బోన్‌లా నిలిచాయి. ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్‌ని ఇటీవల రష్యాలో డబ్ చేసి వదిలారు. టీం అంతా అక్కడ తమ సినిమాని ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే.

డివైట్ టాక్ తెచ్చుకున్నా కానీ చెప్పుకోదగ్గ కలెక్షన్లే వచ్చాయంటున్నారు మేకర్స్.. ఇక ఫస్ట్ పార్ట్‌తో అదరగొట్టేసిన టీం.. సెకండ్ పార్ట్ ‘పుష్ప – ది రూల్’ షూటింగ్ ఈమధ్యనే ప్రారంభించింది. కొద్ది రోజుల పాటు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ జరిపారు. సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను ప్రధాన పాత్రధారులపై చిత్రీకరించారు. ఫారెస్ట్‌తో పాటు పలు అందమైన లొకేషన్లలో షూట్ చేశారు. తాజాగా అక్కడి షెడ్యూల్ కంప్లీట్ అయింది.

ఈ సందర్భంగా వైజాగ్‌కి థ్యాంక్స్ చెబుతూ.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో బీచ్‌లో ఉన్న ఫోటోతో పాటు లవ్ సింబల్‌తో కూడిన విశాఖపట్నం పిక్‌ని కూడా షేర్ చేశారు అల్లు అర్జున్. ఆయన ఫేస్ రివీల్ చేయకపోయినా.. వెనుక నుండి డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇమేజెస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొదటి భాగంలో మంగళం శ్రీను భార్యగా నెెగెటివ్ క్యారెక్టర్‌లో కనిపించిన అనసూయ రెండో భాగంలో ఓ స్పెషల్ సాంగ్ చేయనుందని సమాచారం.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus