పుష్పాలో పాత్ర కోసం బన్నీ బరువు తగ్గుతున్నాడట

  • July 26, 2020 / 11:57 AM IST

టాలీవుడ్ లో ఉన్న డెడికేటెడ్ హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. ప్రయోగాలకు ముందుండే బన్నీ, పాత్ర కోసం బాడీ షే ప్స్ కూడా మార్చేస్తుంటారు. ఇక బన్నీ తన నెక్స్ట్ మూవీ కోసం బాగా గడ్డం మరియు జుట్టు పెంచేశారు. లారీ డ్రైవర్ గా ఆయన డీగ్లామర్ రోల్ చేస్తుండగా…ఆ పాత్ర కోసం ఆయన అలా తయారయ్యారు. కాగా ఈ మధ్య బన్నీ ఎక్కువగా జూబ్లీ హిల్స్ రోడ్లపై ఉదయం జాగింగ్ చేస్తూ కనిపిస్తున్నారు. షూటింగ్ లేకపోవడంతో ఆయన అలా క్యాజువల్ గా జాగింగ్ చేస్తున్నారని అందరూ భావించారు.

ఐతే ఆయన సినిమా కోసం మార్నింగ్ జాగ్ చేస్తున్నారని తెలుస్తుంది. పుష్ప మూవీలో ఆ పాత్ర కోసం బన్నీ బరువు తగ్గాలని టార్గెట్ గా పెట్టుకున్నాడట. షూటింగ్ మొదలయ్యే లోపు కనీసం 8 కిలోల బరువు తగ్గాలనేది అల్లు అర్జున్ టార్గెట్ అని సమాచారం. అంత పెద్ద మొత్తంలో బరువు తగ్గడం కోసం బన్నీ డైలీ మార్నింగ్ బయట జాగింగ్ చేస్తున్నారట. ఇది తెలిసిన ఆయన ఫ్యాన్స్ బన్నీ డెడికేషన్ వావ్ అంటున్నారు. ఇక సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ పుష్పతో ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.

రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నాలుగు భాషలలో విడుదల కానుంది. బన్నీ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా పుష్ప తెరకెక్కనుంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం నెక్స్ట్ షెడ్యూల్ కొరకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలోని అడవి ప్రాంతాల్లో షూట్ చేయాలని చూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus