కోడలి లోపం బయట పెట్టేసిన అమల…!

Advertisement

సమంత అక్కినేని .. టాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఈమె అక్కినేని వారి ఇంటికోడలు అయ్యాక… క్రేజ్ మరింతగా పెరిగింది అనడంలో సందేహం లేదు. గత రెండేళ్లుగా సమంత నటించిన సినిమాలు అన్నీ హిట్లే…! అయితే ఈ ఏడాది ఆమె నటించిన ’96’ రీమేక్ కు మంచి టాక్ వచ్చినా ప్లాప్ అయ్యింది. ఇదిలా ఉంటే… నాగ చైతన్య తో పెళ్ళై 2 ఏళ్లు దాటింది కాబట్టి.. సమంత ప్రెగ్నెంట్ అనే ప్రచారం నడుస్తున్న వేళ… ఇప్పుడు ఆమె అత్తగారు అమల చేసిన కామెంట్స్ పెద్ద వైరల్ గా మారాయి.

నిజానికి సమంత అత్తగారు లక్ష్మీ దగ్గుబాటి.నాగ చైతన్య తల్లి ఈమెనే అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే చైసామ్ లు .. అమల , నాగ్ ల వద్దే ఉంటారు. ఇదిలా ఉండగా … ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న అమల … సమంత లోపాన్ని బయట పెట్టేసింది. విషయం ఏమిటంటే… అమల కి వంట రాదట.. తన భర్త నాగార్జునే బెస్ట్ కుక్ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు సమంత కు కూడా వంట రాదట.

ఆ విషయాన్ని చెప్పేసి.. నవ్వులు పూయించింది. చైతన్య మంచి కుక్. వాళ్ళ ఇంట్లో కూడా చైతూనే వంట చేస్తాడు అని చెప్పింది. గతంలో కూడా అనేక సార్లు .. నాగార్జున బెస్ట్ కుక్, చైతన్య కూడా వంటలు బాగా చేస్తాడు అని తన సోషల్ మీడియాలో అమల పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఏమైనా మన కింగ్ భార్య … స్టార్ హీరోయిన్ అయిన కోడలి లోపాన్ని చెప్పి షాక్ ఇచ్చింది.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus