Amigos First Review: అమిగోస్ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • February 8, 2023 / 01:51 PM IST

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చూసి తన అభిప్రాయాన్ని పంచుకున్నారని తెలుస్తోంది. అమిగోస్ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో నటించగా ఒక పాత్రకు మరో పాత్రకు పొంతన లేకుండా ఉంటుందని సమాచారం. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక పాత్రలో కళ్యాణ్ రామ్ తన నట విశ్వరూపం చూపించనున్నారని తెలుస్తోంది.

అమిగోస్ మూవీకి ఇప్పటికే సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ రిపోర్ట్ అందగా ఎన్టీఆర్ కూడా అమిగోస్ కళ్యాణ్ రామ్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలుస్తుందని చెప్పినట్టు బోగట్టా. బింబిసార సినిమాకు తారక్ పాజిటివ్ రియాక్షన్ ఇవ్వగా ఆ మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తనకు తెగ నచ్చేసిందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారట.

సెకండాఫ్ తారక్ ను ఎంతగానో ఆకట్టుకుందని సినిమా రిజల్ట్ విషయంలో ఏ మాత్రం టెన్షన్ అవసరం లేదని తారక్ కళ్యాణ్ రామ్ కు సూచించారని బోగట్టా. ఈ సినిమా బింబిసార సినిమాను మించి కలెక్షన్లను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ వరుస విజయాలను సొంతం చేసుకొని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. అమిగోస్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అమిగోస్ మూవీ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ సక్సెస్ సాధిస్తే కళ్యాణ్ రామ్ తర్వాత సినిమాలకు సైతం భారీగా బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అమిగోస్ కళ్యాణ్ కెరీర్ లో స్పెషల్ మూవీలో మెమరబుల్ మూవీగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అమిగోస్ మూవీ కళ్యాణ్ రామ్ ఆశలను నిజం చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus