ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు ఆమిర్ ఖాన్ మరోసారి పెళ్లి చేసుకోబోతున్నాడా? ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? అవుననే అంటున్నాయి బెంగళూరు వర్గాలు. అదేంటి ఆమిర్ ఉండేది ముంబయిలో. పెళ్లి జరిగితే అక్కడ జరగాలి కానీ బెంగళూరు సమాచారం ఏంటి అనుకుంటున్నారా? అవును మీరు చదివింది కరెక్టే. ఆమిర్ ఖాన్ పెళ్లి జరగబోయేది అక్కడేనట. ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో ఆమిర్ అక్కడ పెళ్లి చేసుకుంటారని ఓ టాక్ బయటకు వచ్చింది.
ప్రస్తుతం బయటకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే జులై 5న ఆమిర్ పెళ్లి జరగనుందని సమాచాం. అతికొద్ది మంది అతిథుల సమక్షంలో పెళ్లి వేడుకను ప్లాన్ చేస్తున్నారని టాక్. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం ఇప్పుడే వస్తుందని చెప్పలేం. సమాచారం ప్రకారం అయితే గౌరి స్ప్రాట్‌ను బెంగళూరు శివారులోని ఒక రిసార్టులో వివాహం చేసుకోనున్నారు. రీనా దత్తా, కిరణ్ రావ్‌కు ఇప్పటికే విడాకులు ఇచ్చిన ఆమిర్.. గత కొన్నేళ్లుగా గౌరితో ప్రేమలో ఉన్నాడు.
గౌరికి ఏడేళ్ల కుమార్తె ఉంది. బెంగళూరు, ముంబయిలో ఆమెకు ప్రముఖ సెలూన్లు ఉన్నాయి. బ్లూ మౌంటెయిన్ పాఠశాలలో చదివిన గౌరి 2004లో లండన్ విశ్వవిద్యాలయంలో ఫ్యాషన్ కోర్సు, ఎఫ్‌డీఏ స్టైలింగ్, ఫొటోగ్రఫీ కోర్సులను చేసింది. గతేడాది.. తన 60వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో గౌరీతో తన రిలేషన్ గురించి ఆమిర్ తొలిసారిగా బయటపెట్టాడు. అప్పటికే ఏడాదిన్నర నుండి ఆమెతో డేటింగ్‌లో ఉన్నట్లు చెప్పాడు.
ఆ తర్వాత గౌరిని మీడియాకు పరిచయం చేస్తూ తనకెంతో మద్దతు ఇస్తుందని చెప్పాడు. అంతేకాదు తమ దృష్టిలో వివాహమంటే రెండు మనసుల కలయిక అని, అలా చూస్తే తాము పెళ్లి చేసుకున్నట్టేనన్నాడు. ఇప్పుడు అధికారికంగా పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. గత కొన్నేళ్లుగా సరైన విజయం దక్కక ఇబ్బంది పడుతున్న ఆమిర్‌కు ఈ పెళ్లి ఏమైనా విజయం అందిస్తుందేమో చూడాలి.