Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Advertisement

‘ఆదర్శ కుటుంబం: హౌస్‌ నెం 47’ సినిమా షూటింగ్‌ చివరి దశకు వచ్చిందని టాక్‌. దీంతో వెంకటేశ్‌ కొత్త సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అనే చర్చ జరుగుతోంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకీ కొత్త సినిమా ఇప్పటికే అనౌన్స్‌ చేశారు. వచ్చే సంక్రాంతి రిలీజ్‌ టార్గెట్‌తో ఈ సినిమా ఉండబోతోంది అని చెప్పారు కూడా. ఇప్పుడు దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేశారు. కథను పూర్తి స్థాయిలో రెడీ చేసుకున్నారు. ఈ మేరకు స్క్రిప్ట్‌కి పూజలు కూడా చేయించారు.

Anil Ravipudi

సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్‌గారు’తో వచ్చి మంచి విజయం అందుకున్నారు ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి. నెక్స్ట్ ఇయర్‌ వెంకటేశ్‌, నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోలుగా సినిమా అనౌన్స్‌ చేశారు. అంతేకాదు తన స్వగ్రామం బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం చిలుకూరివారిపాలెంలోని శ్రీఆంజనేయస్వామి సన్నిధిలో పండితుల నేతృత్వంలో కొత్త సినిమా స్క్రిప్ట్‌నకు పూజలు చేయించారు అనిల్‌ రావిపూడి. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

స్క్రిప్ట్‌కు పూజలు చేయించి తన తల్లిదండ్రులు రావిపూడి బ్రహ్మయ్య, అనంతలక్ష్మి చేతుల మీదుగా అనిల్‌ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ సాయికృష్ణ, రచయిత నారాయణ, కో డైరెక్టర్‌ సూర్య, ఎడిటర్‌ తమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత చిలకలూరిపేట మండలం బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో స్క్రిప్ట్‌కు పూజలు చేశారు. ఇక ఈ సినిమా జులై లేదా ఆగస్టు నుండి షూటింగ్‌ జరుపుకోనుందని సమాచారం.

ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్‌ చేస్తున్నారు. ‘ఆదర్శ కుటుంబం’ తర్వాత వెంకటేశ్‌ వెంటనే ఈ సెట్‌లో అడుగుపెడతారట. కల్యాణ్‌ రామ్‌ ఎలాగూ ఇప్పుడు సినిమాలు చేయడం లేదు కాబట్టి.. ఆయన ఆల్‌రెడీ ఈ పాత్ర కోసం రెడీ అవుతున్నారట. ఈ సినిమాలో వెంకటేశ్‌ సరసన కీర్తి సురేశ్, కల్యాణ్‌ రామ్‌ సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. ఇది బావాబామ్మర్దులు కథ అని తెలుస్తోంది. సినిమా పేరు ‘బావ బావమరిది’ అని పెడతారు అని చెబుతున్నారు.

 ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus