టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ దర్శకుల లిస్ట్ పెద్దగానే ఉంది. ఇక అందులో రాజమౌళి – సుకుమార్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పవచ్చు. ఏ మాత్ర ఖాళీ సమయం దొరికినా ఇద్దరు గంటల తరబడి మాట్లాడుకుంటారు. అయితే ఆర్య సినిమా అనంతరం సుకుమార్ పై అసూయతో శత్రువుగా ఫీల్ అయిన వారిలో రాజమౌళి కూడా ఉన్నారు. అయితే శత్రువుగా ఫీల్ అవ్వడం కంటే ఒక ఫ్రెండ్ గా చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని జక్కన్న ఒక ఇంటర్వ్యూలో సుక్కు మొహం మీదే చెప్పేశాడు.
అయితే సుకుమార్ తన అతి తెలివితో కొన్నిసార్లు తొందరపడి డిజాస్టర్ తీసినప్పుడు రాజమౌళి ఒక్కడే అతని పక్కన ఉన్నాడు. ప్రపంచం మొత్తం ఒకవైపు ఉంటే రాజమౌళి మాత్రమే నా వైవు ఉన్నాడని సుకుమార్ కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు. ఆర్య హిట్టయిన తరువాత సుకుమార్ ఎవరు చెప్పినా వినకుండా కాస్త తొందరపడి జగడం సినిమా తీశాడు. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఒంటరిగా ఫీల్ అయిన సుకుమార్ ను రాజమౌళి కారులో 10 నిమిషాల పాటు తిప్పి ఆ ప్రయాణంలో ఒక మంచి సపోర్ట్ ఇచ్చాడట.
సినిమా చాలా బాగా వచ్చింది అంటూ నువ్వు తలచుకుంటే ఇంకా బాగా తియ్యగలవని ధైర్యం చెప్పాడట. అనంతరం ఆర్య 2 తరువాత కూడా జక్కన్న సుకుమార్ వైపే ఉన్నాడు. ఇక అప్పుడు 100% లవ్ తో హిట్టు కొట్టి ఫామ్ లోకి వచ్చాడు.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?