‘ఆనంద్’ మూవీ సమత గుర్తుందా.. ఇప్పుడు ఏం చేస్తోందంటే

  • February 8, 2021 / 09:14 PM IST

శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసేవి తక్కువ బడ్జెట్ లోని చిన్న సినిమాలే అయినా అందులో ఎదో తెలియని తియ్యదనం ఉంటుంది. కేవలం క్లాస్ ఆడియెన్స్ అనే కాకుండా చాలా వరకు మాస్ ఆడియెన్స్ ను కూడా ఆయన సినిమాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే కమ్ముల బెస్ట్ సినిమాల్లో ఆనంద్ ఒకటి. మంచి కాఫీ లాంటి ఆ సినిమాలో అందరికి ఎక్కువగా కనెక్ట్ అయిన పాత్ర సమత. హీరోయిన్ ఇంట్లో చలాకీగా ఉంటూ తన మాటలతో ఆడియేన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న ఆ అమ్మాయి అసలు పేరు బఖితా ఫ్రాన్సిస్.

2004లో వచ్చిన ఆ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన బఖితా ఫ్రాన్సిస్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా అందుకుంది. అయితే ఆ సినిమా తరువాత బఖితా మళ్ళీ బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు. ఇక ఆమె ఇప్పుడు ఎక్కడున్నారని ఆరా తీయగా అమెరికాలో సెటిల్ అయినట్లు తెలుస్తోంది. బఖితా ఫ్రాన్సిస్ కు నటిగా మంచి టాలెంట్ ఉన్నప్పటికీ అది తన ఫ్యాషన్ కాదని కేవలం శేఖర్ కమ్ముల ప్రభావం వల్లనే సరదాగా ఆనంద్ సినిమాలో నటించిందట.

ఇక ప్రస్తుతం ఆమె అమెరికాలో మహిళపై జరుగుతున్న అన్యాయాలపై పోరాటాలు చేస్తున్నారు. ఈక్వల్ రైట్స్ అంటూ సామాజంలో సమానత్వం పూర్తి స్థాయిలో రావాలని గత 17ఏళ్ళ నుంచి ఆమె కొన్ని ట్రస్టుల ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆనంద్ సమత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1

2

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus