అంబానీ ఇంట పెళ్లి.. స్టార్‌ గెస్ట్‌లకు ఇవి ఇచ్చారా? ధర తెలిస్తే షాకే!

అంబానీల ఆస్తి ఎంత ఎక్కువో, వాళ్లింట్లో జరిగే వేడుకల స్థాయి కూడా అంతే ఎక్కువ. అన్నట్లు వాళ్ల సేవా కార్యక్రమాలు కూడా ఎక్కువే అనుకోండి. అలాంటి ఇంట పెళ్లి జరిగితే.. ఎలా ఉంటుంది చెప్పండి. ఏడు నెలలుగా ఈ పెళ్లి వేడుకలు సాగుతున్నాయి. వాటి రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి, చదువుతూనే ఉన్నారు కూడా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. పెళ్లికి వచ్చిన స్టార్‌ హీరోలు, సెలబ్రిటీలకు ఇచ్చిన గిఫ్ట్స్‌. అవును ఒక్కో గిఫ్ట్‌ ధర రూ. రెండు కోట్లు అంటున్నారు.

జులై 12న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ వివాహం ఘనంగా జరిగింది. జులై 13న రిసెప్షన్ కూడా నిర్వహించారు. దీనికి వివిధ రంగాలకు చెందిన గెస్ట్‌లు చాలామంది వచ్చారు. అయితే అందులో కొంతమంది స్టార్‌ హీరోలకు వాచీలు గిఫ్ట్‌గా ఇచ్చారు అంటూ ఓ ఫొటో సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతోంది. బ్రాండెడ్ లగ్జరీ వాచీల బ్రాండ్‌ అడెమార్స్ పిగ్యుట్ కంపెనీకి చెందిన వాచీలను బహుమతిగా ఇచ్చారని సమాచారం.

మార్కెట్‌లో ఒక్కో వాచీ ధర సుమారు రూ. రెండు కోట్లు అని చెబుతున్నారు. ఆ వాచీతో షా రుఖ్‌ ఖాన్ (Shah Rukh Khan) , రణ్‍‌వీర్ సింగ్ (Ranveer Singh) లాంటి హీరోలు పోజులిచ్చిన ఫొటోలు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. అంబానీ ఇంట్లో పెళ్లి అంటే ఆ మాత్రం ఆడంబరం తప్పదు. ఇలాంటి భారీ గిఫ్ట్‌లూ తప్పవు అని కామెంట్లు చేస్తున్నారు. ఈ పెళ్లి అంబానీ ఫ్యామిలీ సుమారు రూ.5 వేల కోట్ల ఖర్చు చేసింది అని సమాచారం.

ముఖ్యమైన అతిథుల కోసం అంబానీ కుటుంబం ఈ వాచీలను ప్రత్యేకంగా సిద్ధం చేయించింది అంటున్నారు. మరి నిజంగానే ఆ వాచీల ధర అంతనా? ఎవరెవరికి ఇచ్చారు అనేది ఆసక్తికరంగా మారింది. డబ్బులు, గిఫ్ట్‌లకు హీరోల ఇలాంటి పెళ్లిళ్లకు వెళ్తున్నారు అనే కామెంట్ల నేపథ్యంలో ఈ వాచీల ఫొటోలు బయటకు రావడం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus