KA Teaser: గూస్ బంప్స్ వచ్చేలా ‘క‌’ టీజర్.. కిరణ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పక్కా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఒకరు. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని కిరణ్ అబ్బవరం ‘క‌’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వెరైటీ టైటిల్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన కిరణ్ అబ్బవరం టీజర్ లో అద్భుతమైన నటనతో అదరగొట్టారు. ఈ సినిమాలో సరికొత్త లుక్ లో, సరికొత్త పాత్రతో కిరణ్ అబ్బవరం మెప్పించడం ఖాయమని టీజర్ చూస్తే అర్థమవుతోంది.

ఈరోజు కిరణ్ అబ్బవరం పుట్టినరోజు కాగా పుట్టినరోజు సందర్భంగా ‘క‌’ టీజర్ విడుదలైంది. మంచివాడిగా కనిపించే చెడ్డోడిగా ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం కనిపించనున్నారు. ఎక్కడినుంచో ఒక ఊరికి వచ్చి పోస్ట్ మేన్ గా పని చేసే హీరో పక్కవాళ్ల ఉత్తరాలు ఎందుకు చదువుతాడు? ఆ ఉత్తరాల వల్ల తన జీవితంలో వచ్చిన మార్పులేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

టీజర్ చివర్లో తోడేలువిరా నువ్వు అని చెప్పిన డైలాగ్ టీజర్ కు హైలెట్ గా నిలిచింది. 20 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కగా ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాతో మాస్ హీరోగా కిరణ్ అబ్బవరం క్రేజ్ పెంచుకోవడం పక్కా అని చెప్పవచ్చు. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.

‘క‌’ మూవీ బిజినెస్ పరంగా కూడా అదరగొడుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. కిరణ్ అబ్బవరం ఖాతాలో బ్లాక్ బస్టర్ పక్కా అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేస్తే మాత్రం ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సినిమా చిన్న సినిమాలలో పెద్ద హిట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus