పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘కల్కి 2898 AD’ మూవీలో కర్ణుడి క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసిన తీరుపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ముఖ్యంగా ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ ఈ విషయంపై ఓపెన్‌గా విమర్శలు గుప్పించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. సినిమాటిక్ లిబర్టీ పేరుతో ఇతిహాసాలను వక్రీకరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. తాజాగా ఈ ఇష్యూపై మరోసారి స్పందించిన ఆయన.. తన పాత కామెంట్స్‌కే ఇప్పటికీ కట్టుబడి ఉన్నానంటూ మరోసారి కుండబద్దలు కొట్టారు.
ఓ రీసెంట్ ఇంటర్వ్యూలో అనంత శ్రీరామ్ ఈ టాపిక్‌పై మరింత క్లారిటీ ఇచ్చారు. “రామాయణ, మహాభారతాలు కేవలం కథలు కావు.. అవి మన చరిత్ర. ఆ ఇతిహాసాలను ఉన్నది ఉన్నట్లుగా మనకు అర్థమయ్యేలా రాసుకున్నాం తప్ప, వాటిని ఇష్టం వచ్చినట్లు మార్చే హక్కు ఎవరికీ లేదు. కమర్షియల్ హంగుల కోసం ఒక చెడ్డ పాత్రను గొప్పగా ఎలివేట్ చేసి చూపిస్తే అస్సలు సహించలేం.
గతంలో ఇలాంటి తప్పులను ప్రశ్నించడానికి సరైన ప్లాట్‌ఫామ్స్ ఉండేవి కావు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అందుకే గొంతెత్తి మాట్లాడుతున్నాను. భవిష్యత్తులో మన పురాణాలను ఎవరు వక్రీకరించినా నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది” అని ఆయన చాలా స్ట్రాంగ్‌గా చెప్పారు.ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అనంత శ్రీరామ్ చేతి నిండా ఆఫర్స్‌తో బిజీగా ఉన్నారు. తనదైన పంక్తులతో యూత్‌ను ఆకట్టుకుంటున్నారు. రీసెంట్‌గా ‘పెద్ది’ సినిమా కోసం ఆయన రాసిన ‘రై.. రై రారా’ సాంగ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో ఆయన మరో మూడు క్రేజీ సాంగ్స్ రాశారు. త్వరలోనే ఈ పాటలు కూడా అఫీషియల్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.