Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

సినిమా రిలీజ్‌కి గట్టిగా చూస్తే ఓ వారం టైముంది. ఇంకా ప్రచారం సరైన స్థాయిలో స్టార్ట్ చేయలేదు. ఇదిగో అదిగో అంటూ హడావుడి చేస్తున్నారు కానీ సినిమా ప్రమోషనల్‌ కంటెంట్‌ బయటకు రావడం లేదు. ఇదేదో చిన్న సినిమా అనుకుంటే ఫర్వాలేదు. ఇండస్ట్రీలో నాన్‌ పాన్‌ ఇండియా సినిమాల్లో అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాల్లో టాప్‌లో ఉన్న సినిమా తర్వాత ఆ స్టార్‌ హీరో నుండి వస్తున్న సినిమా ఇది. అయితే సినిమా టీమ్‌ ఇవన్నీ చూస్తున్నట్లు లేదు. ఏదో సినిమా విడుదలకు ఇంకే మూడు, నాలుగు వారాలు ఉన్నట్లు ప్రచారం చేస్తోంది..

Ustaad Bhagat Singh

ఇదంతా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా గురించే అని మీకు అర్థమయ్యే ఉంటుంది. రిలీజ్‌ డేట్‌ ఎప్పుడో చెప్పకపోయినా ఏప్రిల్‌ 30న రావొచ్చు అనే పుకార్ల నడుమ.. హఠాత్తుగా మార్చి 26న వస్తామని ప్రకటించి షాక్‌ ఇచ్చిన ‘ఉస్తాద్‌..’ టీమ్‌ ఆ తర్వాత డేట్‌ని మార్చి 19కి మార్చి ఇంకా పెద్ద షాక్‌ ఇచ్చింది. అయితే ముందుకొచ్చినంత స్పీడ్‌ ప్రచారం చేయడం లేదు. చూస్తుంటే సినిమా డేట్‌ మారిన విషయం వారికే గుర్తు లేనట్లుంది.

ఛస్‌.. ఊరుకోండి. సినిమా నుండి వరుస అప్‌డేట్‌లు వస్తున్నాయి. పాటల రిలీజ్‌ డేట్‌లు వస్తున్నాయి, పాటలు వస్తున్నాయి. పోస్టర్‌లు వస్తున్నాయి. ఇప్పుడు ట్రైలర్‌ని ఈ నెల 14న రిలీజ్‌ చేస్తామని కూడా చెప్పారు. ఇంకేం కావాలి అంటారా? ఇవన్నీ నార్మల్‌గా జరిగేవే. కానీ ‘ఓజీ’ సినిమాకు జరిగినట్లు ఊపైతే కనిపించడం లేదు. ఇక ప్రీమియర్స్‌ సంగతి సరేసరి. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ రేట్ల హైక్‌, స్పెషల్ షోలు ఈజీగానే ఓకే అవుతాయి. తెలంగాణ సంగతి తేలడం లేదు. అది తేలితే మంచి బజ్‌ పక్కా.

మరోవైపు సినిమా గురించి హరీశ్‌ శంకర్‌ మాట్లాడటం తప్ప ఇంకెవరూ మాట్లాడటం లేదు. హీరో పవన్‌ కల్యాణ్‌ బిజీ అవ్వొచ్చు. ఇద్దరు హీరోయిన్లూ బిజీ అయిపోయినట్లున్నారు. ఎక్కడా బయటకు వచ్చి సినిమా గురించి మాట్లాడటం లేదు. ‘ఓజీ’ సినిమా కోసం అయితే కనీసం సంగీత దర్శకుడు తమన్‌ బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ సినిమాకు అలాంటి అవకాశం కనిపిచండం లేదు. కాబట్టి సినిమా టీమ్‌ జోరు పెంచాల్సిన సమయం వచ్చింది. ట్రైలర్‌ వచ్చాక జరుగుతుందేమో చూడాలి.

 అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus