Anasuya: పొట్టి డ్రెస్‌లో అనసూయ జలకాలాట.. వైరల్ అవుతున్న వెకేషన్ ట్రిప్ ఫోటోలు.!

టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bhardwaj)   సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ మాములుగా ఉండదు.. ఒకవైపు చేతిలో వరుస సినిమాలు ఉన్నా కూడా మరోవైపు ఫ్యామిలీతో వేకెషన్స్ ఎంజాయ్ చేస్తూ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తుంది.. ఇటీవల ఆమె వరుసగా పోస్ట్ చేస్తున్న ఫోటోలతో అందరి అభిమానులకు మంచి విందు ఇస్తున్నారు.. మే 15 న అనసూయ తన 39వ పుట్టినరోజుని ఘనంగా జరువుకున్నారు. తన భర్త, పిల్లలతో కలిసి చిన్న టూర్ వేసింది.

ప్రస్తుతం అనసూయ కాసేపు వర్క్ లైఫ్ ను పక్కన పెట్టేసి అక్కడ బాగా చిల్ అయ్యి అవుతుంది చెప్పవచ్చు. ఫ్యామిలీ వెకేషన్ ట్రిప్​లో భాగంగా సిక్కింలో అందమైన నదీలోయ ప్రాంతానికి వెళ్లింది. భర్త సుశాంక్ భరద్వాజ్, ఇద్దరు కుమారులతో నదిలోకి దిగి జలకాలాడుతూ పై నుండి పడుతున్న వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేస్తు ఫొటోలకి ఫోజులు ఇచ్చింది. ఈ భామ బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ అలాగే పింక్ కలర్ పొట్టి నిక్కర్ ధరించి పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించింది. ప్రస్తుతం అనసూయ ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus