Anasuya: ‘పుష్ప 2’ సెట్స్ లో అడుగుపెట్టిన అనసూయ..!

  • June 27, 2023 / 09:40 PM IST

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మూడో చిత్రంగా రూపొందిన ‘పుష్ప’ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. నార్త్ లో కూడా ఈ మూవీ వంద కోట్ల పైనే వసూళ్లను సాధించింది. దీంతో పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు విడుదల చేసిన వీడియో తెలియజేసింది.

ఇక ‘పుష్ప 1’ లో మంగళం శ్రీను(సునీల్) భార్య దాక్షాయణిగా అనసూయ నటించిన సంగతి తెలిసిందే. తమ్ముడి చావుతో పుష్ప పై పగ పెంచుకుని.. దాని కోసం కట్టుకున్న మొగుడి గొంతు కోసే పాత్రలో అనసూయ కనిపించింది. ఈ మూవీలో ఆమె మేకోవర్ కూడా కొత్తగా ఉంటుంది. ఇక ‘పుష్ప 2’ లో కూడా అనసూయ పాత్ర ఉంటుందని పార్ట్ 1 తోనే క్లారిటీ ఇచ్చాడు సుకుమార్. దానిని నిజం చేస్తూ అనసూయ ‘పుష్ప 2’ షూటింగ్లో జాయిన్ అయ్యింది.

దాక్షాయణి గెటప్లోకి మారుతూ తీసుకున్న ఫోటోని తాజాగా తన (Anasuya) ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది అనసూయ. నిజానికి పుష్ప 2 షూటింగ్ ఎప్పుడో మొదలైంది. అయితే ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ఇప్పుడే మొదలైనట్టు స్పష్టమవుతుంది. మరి పుష్ప 2 లో అనసూయ ఎంత క్రూయల్ గా కనిపిస్తుందో.. ‘పుష్ప’ కి ఎలాంటి ఆటంకాలు, ఆపదలు తెచ్చి పెడుతుంది అనేది తెలియాల్సి ఉంది.ప్రస్తుతానికి అనసూయ పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.

 

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus