Anasuya, Kota Srinivasarao: కోటా శ్రీనివాసరావు కామెంట్స్ పై అనసూయ రియాక్షన్!

  • October 19, 2021 / 10:48 AM IST

సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ డ్రెస్సింగ్ గురించి మాట్లాడారు. అనసూయ మంచి నటి అని.. కానీ ఆమె డ్రెస్సింగ్ తనకు నచ్చదని అన్నారు. అనసూయ లాంటి అమ్మాయి ఎలా ఉన్నా చూస్తారని.. దానికోసం అలాంటి బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదని కోటా అన్నారు. దీనిపై అనసూయ ఘాటుగా స్పందించింది. కోటా శ్రీనివాసరావు పేరు ప్రస్తావించకుండా.. ఓ సీనియర్ నటుడి వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని అన్నారు.

ఎంతో అనుభవం ఉన్న ఆ నటుడు మరీ ఇంత నీచంగా వ్యాఖ్యానించడం విచారకరమని పేర్కొన్నారు. ఎలాంటి దుస్తులు ధరించాలనేది వ్యక్తిగత విషయమని.. ఒక్కోసారి వృత్తిపరంగా కూడా విభిన్న ఆహార్యంలో కనిపించాల్సి ఉంటుందని అనసూయ చెప్పుకొచ్చింది. కానీ నేటికీ సోషల్ మీడియాలో వేరొకరి వేషధారణ, దుస్తులపై పనికిరాని చెత్తను ప్రముఖంగా ప్రచారం చేస్తుండడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. అప్పట్లో సోషల్ మీడియా ఉండుంటే.. సినిమాల్లో ఈ నటుడు వేసిన తాగుబోతు వేషాలను, మహిళలను అవమానించడాన్ని ప్రశ్నించి ఉండేదా అని నిలదీశారు.

పెళ్లై, పిల్లలు కూడా ఉండి.. వెండితెరపై చొక్కా లేకుండా బాడీ చూపిస్తూ హీరోయిన్లతో రొమాన్స్ చేసే స్టార్లను ఎందుకు ప్రశ్నించరు అని అడిగింది. నాలాగా పెళ్లై, ఇద్దరు బిడ్డలా తల్లి అయి ఉండి ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తూ.. వృత్తిపరంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న వారు.. అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించేవారు మీకు నచ్చడం లేదా అంటూ ప్రశ్నించారు.

1

2

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus