Anasuya: పవన్ కళ్యాణ్ కాలిగోటికి సరిపోవన్నారు : అనసూయ

  • April 4, 2021 / 08:45 PM IST

ఒకవైపు బుల్లితెరపై జబర్దస్త్ షోతో బిజీగా ఉంటూనే తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో సినిమా ఆఫర్లు సొంతం చేసుకుంటూ అనసూయ బిజీగా ఉన్నారు. క్షణం, రంగస్థలం సినిమాల్లోని పాత్రలు అనసూయ మంచి నటి అని ప్రూవ్ చేశాయి. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ బిజీగా ఉన్న అనసూయ గత నెలలో విడుదలైన చావుచబురు చల్లగా సినిమాలో పైన పటారం లోన లొటారం పాటతో ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. అయితే చాలా సందర్భాల్లో అనసూయ వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు.

తనను ట్రోల్ చేసిన నెటిజన్లకు దిమ్మతిరిగేలా అనసూయ కౌంటర్లు ఇవ్వగా కొన్నిసార్లు ఆమెపై ప్రశంసలు వ్యక్తమైతే మరి కొన్నిసార్లు ఆమెపై విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు అనసూయ ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. అనసూయ ఈ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు బోల్డ్ గా సమాధానాలు ఇవ్వడం గమనార్హం. తాను చేసే సాంగ్స్ ఐటెం సాంగ్స్ కానే కావని మగవాళ్లు డిస్కో సాంగ్స్ చేస్తే ఐటెం బాయ్ అననప్పుడు తాను చేసే సాంగ్స్ ను ఐటెం సాంగ్స్ అనకూడదని అనసూయ తెలిపారు.

కెమెరా ముందు అందంగానే కనిపించాలని అలా కనిపించకపోతే ఆంటీ అదీఇదీ అంటారని అనసూయ పేర్కొన్నారు. నా శరీరం విషయంలో నేను గర్వపడతానని నా పొట్ట పెద్దగా ఉంది కాబట్టే నా కొడుకు పొట్టలో కంఫర్టబుల్ గా ఉన్నాడని ఆమె తెలిపారు. గతంలో తనకు పెళ్లై పిల్లలున్నారని తాను యాక్టింగ్ కు పనికి రాననేలా కామెంట్లు చేశారని కానీ బల్లగుద్ది అలా కామెంట్లు చేసిన వాళ్లకంటే తాను బెటర్ గా నటించగలనని చెబుతున్నానని అనసూయ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలోని పాటను రిజెక్ట్ చేసినందుకు తాను పవన్ కళ్యాణ్ కాలిగోటికి కూడా సరిపోననని కొందరు కామెంట్లు చేశారని ఆమె వెల్లడించారు.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus