స్టార్ యాంకర్ అనసూయ నటించిన థ్యాంక్ యు బ్రదర్ సినిమా ఆహా యాప్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. 96 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా అనసూయ ఫ్యాన్స్ ను మెప్పించే విధంగా ఉందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్యూలు ఇస్తున్న అనసూయ ఆ ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను రిచ్ గానే పెరిగానని కానీ ఆ విషయాన్ని ఎక్కడా చెప్పలేదని అనసూయ అన్నారు.
తన తండ్రికి జూదం, గ్యాంబ్లింగ్ పిచ్చి ఉండేదని తమకు గుర్రాలు ఉండేవని అనసూయ చెప్పుకొచ్చారు. తన తండ్రికి ఉన్న అలవాట్ల వల్ల ఆస్తి పోయిందని ఆమె తెలిపారు. ధైర్యంగా ఉండాలని, స్వతంత్రంగా ఉండాలని తండ్రి చెప్పేవారని దూరం నుంచి తాను ఆటోవాళ్లతో ఎలా మాట్లాడుతున్నాను..? వాళ్లను ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాను..? అనేది కూడా తండ్రి గమనించేవారని అనసూయ తెలిపారు. ఆస్తులు పోయిన తరువాత అద్దె ఇంట్లో నివశించేవాళ్లమని డబ్బు తక్కువ మొత్తం ఉండటం వల్ల బస్ స్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్లేదానినని అనసూయ అన్నారు.
ప్రస్తుతం అనసూయ చేతిలో మొత్తం 6 సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ 6 సినిమాలలో పుష్ప సినిమాపై అంచనాలు ఎక్కువగా నెలకొన్నాయి. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, మాలీవుడ్ సినిమాలలో సైతం అనసూయ నటిస్తూ ఉండటం గమనార్హం. థాంక్ యు బ్రదర్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటే అనసూయకు లేడీ ఓరియెంటెడ్ మూవీ ఆఫర్స్ పెరిగే అవకాశం ఉంది.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!