‘ఇరుముడి’ సినిమాకు థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్‌తో సంతోషంగా ఉన్న రవితేజ.. కొత్త సినిమాను షురూ చేసేద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఓటీటీలో ఆ సినిమా వచ్చిన రెస్పాన్స్ చూశాక కాస్త ఆలోచనలో పడ్డారు అని సమాచారం. అయితే ఇప్పటికే ఓకే చేసిన సినిమా పనులను మొదలుపెట్టేద్దాం అని ఫిక్స్ అయ్యారట. అలా వివేక్ ఆత్రేయతో గతంలో ఫిక్స్ అయిన కథను త్వరలో పట్టాలెక్కిస్తారట. ఈ క్రమంలో కాస్టింగ్ పనులు వేగవంతం చేశారట.
ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు అవకాశముండగా.. రెండు పాత్రల కోసం యంగ్ హీరోయిన్లనే చూస్తున్నారట. అలా ఓ పాత్ర కోసం ప్రియాంక అరుళ్ మోహన్‌ని సంప్రదించగా, మరో పాత్ర కోసం అనస్వర రాజన్‌ని ఎంచుకున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ ఇద్దరికి సంబంధించిన ఫొటో షూట్ కూడా చేసేశారట. మరో ముఖ్య పాత్రం కోసం జేడీ చక్రవర్తిని తీసుకుంటున్నారట. ఈ మేరకు త్వరలోనే అనౌన్స్‌మెంట్‌లు ఉంటాయి అని చెబుతున్నారు.
హారర్ అంశాలతో నిండిన ఈ సినిమాను దసరాకి స్టార్ట్ చేస్తారట. ఇక ఈ సినిమా కోసం ‘తులాభారం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’, ‘సరిపోదా శనివారం’ లాంటి సినిమాలతో వివేక్ ఆత్రేయ తానెంత స్పెషల్ అనేది చెప్పకనే చెప్పారు. ఇప్పుడు కూడా రవితేజ కోసం అలాంటి ఓ కథను సిద్ధం చేశారట. లక్ష్మణ్, శ్రీని నిర్మాణంలో రూపొందబోతున్న ఈ సినిమాకు ఓపెనింగ్ కాన్సెప్ట్ వీడియో చేసే ఆలోచనలో ఉన్నారట.
రవితేజ కుమార్తె మోక్షద ‘ఇరుముడి’ సినిమాలాగే ఈ సినిమాకు దగ్గర ఉండి అన్ని పనులు చూసుకోవాలని అనుకుంటోందట. కాబట్టి ఈ సినిమాను కూడా జాగ్రత్తగా రవితేజకు తగ్గట్టుగానే రూపొందిచేలా చూసుకుంటుందట. ‘ఇరుమడి’ సినిమా విజయం ఆమెను అందరూ తెగ మెచ్చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘తులాభారం’ సినిమాకు కూడా మంచి విజయం వస్తే.. ఆమె టాలెంట్ మరింతగా ఎలివేట్ అవుతుంది.