టాలీవుడ్లో నెంబర్ 1 యాంకర్ ఎవరు అంటే .. అందరూ చెప్పే సమాధానం సుమ. అందులో ఎలాంటి సందేహం లేదు. కేరళకు చెందిన వ్యక్తి అయినప్పటికీ తెలుగు అనర్గళంగా మాట్లాడగలదు. సినిమా వేడుక అయినా.. బుల్లితెరపై షో అయినా సుమ చేసే సందడి అంతా ఇంతా కాదు. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా సుమకి క్రేజ్ ఎక్కువ. సుమలో ఉన్న మరో క్వాలిటీ.. ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడటం.
సుమ కొడుకు రోషన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అతని మొదటి సినిమాని సుమ దగ్గరుండి ప్రమోట్ చేస్తుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా ఆమె కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. సుమ మాట్లాడుతూ..”నేను చేయించుకున్న ఇన్సూరెన్స్ ల గురించి అన్ని విషయాలను నేను నా పిల్లలకు వివరంగా చెప్పాను. ఎందుకంటే? నేను హఠాత్తుగా చనిపోతే.. నేను కట్టిన ఇన్సూరెన్స్ ద్వారా ఎవరికి ఎంత వస్తుంది? ఎక్కడెక్కడి నుండి ఎంత మొత్తంలో డబ్బు వస్తుంది? అనే ముఖ్యమైన విషయాలు వారికి తెలియాలి.
అయితే నేను (Suma) ఇలా చనిపోవడం గురించి మాట్లాడగానే.. ‘ఎందుకు అమ్మా.. ఇలా మాట్లాడుతున్నావ్ అని వారు ప్రశ్నించారు. రేపు ఏం జరుగుతుందో మనకి తెలీదు. అందుకే ఈ విషయాలు మీకు తెలియాలి’ అని వివరించాను. చాలా మంది స్త్రీలకు తన భర్త చనిపోయిన తర్వాత పిల్లలను ఎలా పోషించాలి? అనే ప్రశ్న ఎదురవుతుంది. ఇలాంటి ప్రశ్న నా పిల్లలకు ఎదురు కాకూడదని ముందుగానే అన్ని విషయాలు చెప్పుకొచ్చాను” అంటూ తెలిపింది.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!