Tiger Nageswara Rao Review in Telugu: టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 20, 2023 / 01:56 PM IST

Cast & Crew

  • రవితేజ (Hero)
  • నూపూర్ సనన్ (Heroine)
  • గాయత్రి భరద్వాజ్, అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, మురళీశర్మ, నాజర్ తదితరులు.. (Cast)
  • వంశీ (Director)
  • అభిషేక్ అగర్వాల్ (Producer)
  • జివి ప్రకాష్ కుమార్ (Music)
  • R. మధి (Cinematography)

“ధమాకా, వాల్తేరు వీరయ్య” తర్వాత “రావణాసుర”తో హ్యాట్రిక్ హిట్ మిస్ అయిన రవితేజ నటించగా విడుదలైన తాజా చిత్రం “టైగర్ నాగేశ్వరరావు”. తొలుత ఈ సినిమాను రవితేజతోపాటు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కూడా ఎనౌన్స్ చేసి పోస్టర్లు కూడా రిలీజ్ చేసినప్పటికీ.. అనంతరం రవితేజ ఈ ప్రొజెక్ట్ ను ఓన్ చేసుకున్నాడు. ఎనౌన్స్ మెంట్ పోస్టర్ నుండి ట్రైలర్ వరకూ అన్నీ ప్రోమోషనల్ ఎలిమెంట్స్ సినిమా మీద మంచి అంచనాలు పెంచాయి. మరి సినిమా అదే స్థాయిలో ఆకట్టుకుందో లేదో చూద్దాం..!!

కథ: స్టువర్టుపురం అంటే గుర్తొచ్చేది దొంగలు. కానీ.. వాళ్ళు ఆ వృత్తిని ఎంచుకోవడానికి మూలకారణం వేరు. అలా ఓ దొంగగా పెరిగి, మనిషిగా మారి, తన తోటి ఊరి ప్రజల క్షేమం కోసం పొరాడిన ఓ యోధుడి కథగా “టైగర్ నాగేశ్వరరావు” సినిమాను నడిపించారు మేకర్స్. టైగర్ నాగేశ్వర్రావు (రవితేజ) స్టువర్టుపరంలో ఓ సాధారణ దొంగ, చిన్నప్పుడు కన్నతండ్రి తల నరికి చంపిన కుర్రాడిగా అతడికి ఉన్న చరిత్ర గుంటూరు మొత్తం వ్యాపించింది.

అలా ఓ దొంగగా మొదలైన నాగేశ్వర్రావు.. ఒకానొక సందర్భంలో ఏకంగా ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో దొంగతనం చేస్తానంటూ బెదిరింపు లేఖ రాసి మొత్తం పోలీసు వ్యవస్థను పరుగు పెట్టిస్తాడు. అసలు నాగేశ్వర్రావు ఢిల్లీలోని ప్రైమ్ మినిస్టర్ ఇంటికి దొంగతనానికి ఎందుకు వెళ్ళాడు? ఏం దొంగిలించాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “టైగర్ నాగేశ్వర్రావు” కథాంశం.

నటీనటుల పనితీరు: ఫ్యాన్స్ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా “రాజా ది గ్రేట్” విడుదలైన తర్వాత రవితేజ ఎలాంటి లుక్ ఇచ్చినా అంధుడిలానే కనిపిస్తున్నాడు. కానీ “టైగర్ నాగేశ్వర్రావు”లో ఆ లుక్ నుంచి బయటపడ్డాడు. ముఖ్యంగా ప్రతి సినిమాలో గెటప్ విషయంలో దాదాపు ఒకేలా కనిపించే రవితేజ ఈ సినిమాలో కొత్తగా కనిపించాడు. అలాగే.. నటుడిగానూ తనలోని కొత్త యాంగిల్ ను పరిచయం చేశాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో మంచి ఎమోషన్స్ పండించాడు రవితేజ.

హీరోయిన్స్ గా కనిపించిన నుపుర్ సనన్ & గాయత్రి భరద్వాజ్ లకు పెద్దగా స్క్రీన్ టైమ్ లేదు. అయితే.. నుపుర్ నటిగా అలరించలేకపోయింది కానీ.. గాయత్రి భరద్వాజ్ మాత్రం ఆకట్టుకుంది. అనుపమ్ ఖేర్ & నాజర్ మరోమారు తన సీనియారిటీ ప్రూవ్ చేసుకునారు. ఆడుకాలం నరేన్ & హరీష్ లు సినిమాకి మంచి హైలైట్స్ గా నిలిచారు. రేణు దేశాయ్, మురళీశర్మ, జీషు సేన్ గుప్తా, సుదేవ్ నాయర్ లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటిక్ లిబర్టీస్ మరీ ఎక్కువగా తీసుకున్నా.. ఒక సినిమాగా “టైగర్ నాగేశ్వరావు”ను అద్భుతంగా తెరకెక్కించాడు వంశీ. డ్రామాను మరీ ఎక్కువగా పండించడం కోసం సినిమాను కాస్త సాగదీయడం ఒక్కటే మైనస్ గా మారింది. అయితే.. ఈమధ్యకాలంలో విడుదలైన రవితేజ సినిమాల్లో బెస్ట్ ఇంట్రడక్షన్ “టైగర్ నాగేశ్వర్రావు” అని చెప్పొచ్చు. అలాగే సెకండాఫ్ లో వచ్చే ఫ్యాక్టరీ ఫైట్ లో కాస్త హింస శ్రుతిమించినట్లు అనిపించినా.. దానికి ముందు క్రియేట్ చేసిన ఎమోషన్ కి సింక్ అయ్యింది. కాకపోతే.. గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.

ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ కన్విన్సింగ్ గా ఉన్నప్పటికీ.. ఒకే లొకేషన్ లో రిపీటెడ్ సీన్స్ ఉండడంతో కాస్త సాగదీసినట్లుగా ఉంటుంది. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం & నేపధ్య సంగీతం సినిమాకి ఒక ఫ్రెష్ నెస్ తీసుకొచ్చాయి. మధి సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.

విశ్లేషణ: గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త ఖర్చు చేసి ఉంటే రవితేజ్ కెరీర్లో ఒన్నాఫ్ ది బెస్ట్ సినిమాగా “టైగర్ నాగేశ్వర్రావు” నిలిచిపోయేది. అయినప్పటికీ.. ఈమధ్యకాలంలో వచ్చిన రవితేజ సినిమాల్లో డీసెంట్ ఫిలిమ్ గా ఈ చిత్రాన్ని (Tiger Nageswara Rao) పేర్కొనవచ్చు. రవితేజ మరో హిట్ స్కోర్ చేశాడనే చెప్పాలి.

రేటింగ్: 3/5

Click Here to Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus