Anchor Suma: చాలా ఏళ్ల నుంచి దాచిపెట్టా.. సుమ వ్యాఖ్యలు!

  • October 9, 2021 / 04:12 PM IST

యాంకర్ సుమకి బుల్లితెరపై ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమె తెలియని వారుండరు. దాదాపు ఇరవై ఏళ్లుగా యాకరింగ్ లో దూసుకుపోతుంది. స్టార్ హీరోల ఈవెంట్స్ అంటే కచ్చితంగా సుమ ఉండాల్సిందే. ఇక బుల్లితెరపై ఆమె షోలకు కొదవ లేదు. ఇప్పుడు సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి పలు ఇంట్రెస్టింగ్ వీడియోలను షేర్ చేస్తుంది. ఇదిలా ఉండగా.. చాలాకాలంగా దాచిపెట్టిన ఓ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది సుమ.

చాలా ఏళ్ల నుంచి ఒక విషయం దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చానని.. ఇకపై దానిని దాచాలనుకోవడం లేదని చెప్పింది. తను కీలాయిడ్ టెండెన్సీ అనే స్కిన్ సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పింది. ఈ వ్యాధి కారణంగా.. ఒంటిపై ఏదైనా చిన్న గాయమైతే.. అది మరింత పెద్దదిగా చుట్టుపక్కల వ్యాపిస్తుందని చెప్పుకొచ్చింది. దీన్ని పోగొట్టుకోవడానికి చాలా చేశానని.. కానీ ఫలితం లేకుండా పోయిందని.. తన శరీరంగా భాగమైపోయిందని చెప్పుకొచ్చింది. తన ప్రొఫెషన్ మొదలుపెట్టిన కొత్తల్లో మేకప్ ఎలా వేసుకోవాలి..?

ఎలా తీసేయాలి వంటివి తెలియక జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని.. ఇప్పుడు ఉన్నదాన్ని కాపాడుకుంటూ వస్తున్నానని తెలిపింది. రీసెంట్ గా నటి యామీ గౌతమ్ కూడా తనకు చర్మ వ్యాధి ఉందంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫోటోలు షేర్ చేసింది. ఇలాంటి విషయాలను దాటకుండా బయటకు చెప్పగలిగితే మరింత సంతోషంగా ఉండగలమని ఈ తారలు చెబుతున్నారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus