కమర్షియల్ ఎలిమెంట్స్ తో కామెడీ ఎంటర్టైనర్ సినిమాలను అందించే అనిల్ రావిపూడి నెక్స్ట్ F3 సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ – వెంకటేష్ కలిసి నటిస్తున్న ఈ సెకండ్ ఫ్రాంచైజ్ మూవీపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈసారి డబ్బు అనే కాన్సెప్ట్ తోనే సినిమా స్క్రిప్ట్ ను నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ గా సిద్ధం చేసుకున్నాడట. అయితే ఇటీవల అనిల్ కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. అందువల్ల షూటింగ్ కు కొంత బ్రేక్ వచ్చింది.
ఇక కోలుకున్న తరువాత కూడా తగిన జాగ్రత్తలతో మళ్ళీ రీ స్టార్ట్ చేసినప్పటికీ సినిమా అనునున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదా అనే కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. ఇక సినిమాను ఆగస్ట్ 27న విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా దర్శకుడు ఒక క్లారిటి ఇచ్చేశాడు. సినిమాను అందరి ఊహించినట్లుగానే వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పాడు. కోవిడ్ వేవ్ వలన కొన్ని సినిమాలు వాయిదా పడక తప్పడం లేదని అంటూ..
F3 కూడా రిలీజ్ డేట్ విషయంలో రీషెడ్యూల్ చేసుకొని మళ్ళీ కొత్త డేట్ కు రాబోతున్నట్లు అనిల్ వివరణ ఇచ్చారు. త్వరలోనే ఆ డేట్ పై కూడా క్లారిటీ ఇస్తారట. నిర్మాత దిల్ రాజు కూడా కరోనా హడావుడి తగ్గిన తరువాతే జాతిరత్నాలు తరహాలో సినిమాను ప్రమోట్ చేసి విడుదల చేయాలని అనుకుంటున్నారు.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!