Anil Ravipudi: ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి..!

  • April 20, 2021 / 05:00 PM IST

అపజయమెరుగని దర్శకుల లిస్ట్ లో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. గతేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని స్టార్ హీరోల దృష్టిని కూడా ఆకర్షించాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇతను ఏ హీరోతో సినిమా చేసినా ఆ హీరో కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్లను నమోదు చేసే సినిమా తీస్తాడు అనే సెంటిమెంట్ ఉంది. దాంతో స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలు కూడా అనిల్ తో సినిమాలు చెయ్యాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ‘ఎఫ్2’ సీక్వెల్ అయిన ‘ఎఫ్3’ ని తెరకెక్కిస్తున్న అనిల్.. తన తరువాతి సినిమా విషయంలో మాత్రం ప్రేక్షకులను తెగ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు.

మొన్నటి వరకూ అనిల్ తరువాతి సినిమా మహేష్ తో ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ లైన్లోకి వచ్చాడు. అటు తరువాత అల్లు అర్జున్, చరణ్ పేర్లు వినిపించాయి. కానీ ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. అయితే గత రెండు రోజులుగా బాలయ్యతో అనిల్ రావిపూడి సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ను ‘షైన్ స్క్రీన్’ సంస్థ నిర్మించబోతోంది అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే బాలయ్య మాత్రం బోయపాటితో ‘అఖండ’ పూర్తయిన తరువాత గోపీచంద్ మలినేని డైరెక్షన్లో సినిమా సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. అనిల్ రావిపూడితో సినిమా అనే ఆలోచనే ప్రస్తుతానికి బాలయ్యకు లేదని వినికిడి.

మరో పక్క రామ్ తో అనిల్ సినిమా ఫిక్స్ అని వార్తలు వస్తున్నాయి. అయితే లింగు స్వామి డైరెక్షన్లో రామ్ ప్రాజెక్టు ఇంకా మొదలు కాలేదు. తరువాత అతను త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలని భావిస్తున్నాడు. మొన్నటికి మొన్న అఖిల్ తో కూడా అనిల్ రావిపూడి సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.దాని పై కూడా స్పష్టత లేదు. అయినా ఒకేసారి అనిల్ రావిపూడి ఇంతమందితో సినిమాలు చేసేస్తాడా..! కాబట్టి.. తన తరువాతి సినిమా పై అనిల్ క్లారిటీ ఇస్తేనే కానీ, ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదు.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus