Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

‘మన శంకరవరప్రసాద్‌ గారు’ సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రచారంలో సినిమా గురించి తర్వాత ఎక్కువగా చర్చకు వచ్చిన అంశం అంటే.. అనిల్‌ రావిపూడి నెక్స్ట్‌ సినిమా ఏంటి? అని. ఆ తర్వాత చర్చకు వచ్చిన అంశం అనిల్‌ రావిపూడి – నాగార్జున సినిమా. సీనియర్‌ స్టార్‌ హీరోల్లో ముగ్గురితో సినిమా చేసిన అనిల్‌.. నాగార్జునతో కూడా సినిమా చేసేస్తే నలుగురినీ కవర్‌ చేసిన అరుదైన ఘనతను దక్కించుకుంటారు అని వార్తలొచ్చాయి.

Anil Ravipudi

ఈ విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావించినప్పుడు ‘నెక్స్ట్‌ ఆ ఛాన్స్‌ కోసం వెయిట్‌ చేస్తున్నా’ అంటూ చిన్నగా నవ్వేశారు కూడా. అంటే మనసులో సినిమా చేయాలనే ఆలోచన ఉన్నా బయటకు క్లియర్‌గా చెప్పలేదన్నమాట. అయితే రీసెంట్‌ ఓ ఓటీటీ షో కోసం చేసిన ప్రమోషనల్‌ వీడియోలో తన మనసులో మాట చెప్పేశారు అనిల్‌ రావిపూడి. ‘నెక్స్ట్‌ నాగార్జునతో సినిమా చేస్తున్నాం.. ’ అని నోరు జారి ‘చేయాలి’ అని కవర్‌ చేసేశారు.

ఇది లైవ్‌ వీడియో కాదు.. రికార్డింగ్ చేసి, ఎడిటింగ్‌ చేసి, పర్‌ఫెక్ట్‌గా చెక్‌ చేసుకొని రిలీజ్‌ చేసి ఉంటారు. కాబట్టి ఇదేదో అనుకోకుండా జరిగింది అనుకోవడానికి కాలేదు. కావాలనే అనిల్‌ రావిపూడి తన తర్వాతి సినిమా గురించి చెప్పేశారు అనుకోవచ్చు. నాగార్జునతో ఇప్పటికే సినిమా గురించి డీల్‌ కుదుర్చుకుని ఇలా లీక్‌ చేశారా? లేక ముందు మాట అనేసి తర్వాత ఫిక్స్‌ చేసుకుందాం అనుకున్నారా అనేది అనిల్‌కే తెలియాలి.

ఇక అనిల్‌ ప్రజెంట్‌ సినిమా విషయానికొస్తే వెంకటేశ్‌ – కల్యాణ్‌ రామ్‌ హీరోలుగా ఓ సినిమా ఇటీవల అనౌన్స్‌ చేశారు. బావాబామ్మర్దుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. త్రివిక్రమ్ సినిమా ‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ సినిమా తర్వాత వెంకటేశ్‌.. అనిల్ రావిపూడి సెట్‌లోకి అడుగుపెడతారు అని సమాచారం. అయితే ‘దృశ్యం 3’ సినిమా సంగతి తేలేకే ఈ విషయం తేలుతుంది అని టాక్‌. ఇక కల్యాణ్‌ రామ్‌కి అయితే ప్రస్తుతం సినిమాలేవీ లేవు.

మళ్లీ జోనర్‌ మారుస్తున్న రామ్‌.. బన్నీ డైరక్టర్‌ శిష్యుడితో కొత్త సినిమా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus