Ram Pothineni: మళ్లీ జోనర్‌ మారుస్తున్న రామ్‌.. బన్నీ డైరక్టర్‌ శిష్యుడితో కొత్త సినిమా

అనుకున్న కథకు, నమ్ముకున్న సినిమాకు విజయం దక్కకపోతే.. అందులోనూ ఆ సినిమా కోసం రెగ్యులర్‌గా కష్టపడే దాని కంటే ఎక్కువ కష్టపడినా ఫలితం అనుకున్నట్లుగా రాకపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు రామ్‌కి తెలిసినట్లుగా ఇంకెవరికీ తెలియదు అని చెప్పొచ్చు. నటుడిగా, పాట రచయితగా కూడా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా కోసం పని చేశాడు రామ్‌. ఆ సినిమా విడుదల సమయంలో చాలా ఆందోళనగా కూడా కనిపించాడు. ఎక్కువ కష్టపడ్డ సినిమా కదా. ఫలితం ఇబ్బందికరంగా వచ్చేసరికి ఇప్పుడు ఆలోచనలు మార్చేస్తున్నాడు అని టాక్‌. సినిమా హీరో ఆలోచనలు మార్చేస్తున్నాడు అంటే.. జోనర్‌ మార్చేస్తున్నాడు అనే అర్థం.

Ram Pothineni

‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ సినిమా తర్వాత మళ్లీ ఇంతవరకు కొత్త సినిమా కబుర్లేవీ వినిపించలేదు. ఒకట్రెండు ప్రేమ కథలు, కుటుంబ కథలు విన్నాడు కానీ ఓకే చేయలేదు. ఇప్పుడు చూస్తే యాక్షన్‌ థ్రిల్లర్‌ కథను ఓకే చేశాడు అని అంటున్నారు. ప్రముఖ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ దగ్గర డైరక్షన్‌ టీమ్‌లో పని చేసిన లోగి విఘ్నేశ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ చర్చలు తుది దశలో ఉన్నాయని.. ఎవరు నిర్మిస్తారు అనే విషయంలో స్పష్టత రాగానే అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.

నిజానికి రామ్‌కి యాక్షన్‌ జోనర్‌ అంతగా అచ్చొచ్చింది లేదు. తొలి నాళ్లలో ఒకట్రెండు సినిమాలు చేసి మంచి ఫలితమే అందుకున్న రామ్‌.. ఆ తర్వాత ఆ కాన్సెప్ట్‌ సినిమాలకు ఫలితాలు అందుకోలేదు. దీంతో జోనర్‌ మార్చి ప్రేమ కథలు, కుటుంబ నేపథ్య కథలవైపు చూశాడు. అలా కమ్‌ బ్యాక్‌ కూడా బాగానే ఇచ్చాడు. అయితే మళ్లీ అలాంటి సినిమాలు చేసి విజయం అందుకోలేదు. దీంతో ఇటు, అటు కాకుండా రామ్‌ సినిమాల ఎంపిక అయిపోయింది. అన్నట్లు తమిళ దర్శకులు తెలుగు హీరోలకు విజయాలు ఇవ్వడం లేదు. మరి రామ్‌ ఆ అడ్డంకులు అన్నీ దాటుకొని వస్తాడేమో చూడాలి.

హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus