Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Advertisement

‘పెద్ది’ సినిమా టీమ్‌ విషయంలో కథానాయిక జాన్వీ కపూర్‌ కోపంగా ఉందని, అందుకే ప్రచారంలో సరిగ్గా పాల్గొనలేదు అని సినిమా విడుదలకు ముందు వార్తలొచ్చాయి. సినిమా ఆఖరి పాట షూటింగ్‌ విషయంలోనూ కొన్ని ఇబ్బందులు వచ్చాయి అని కూడా అన్నారు. అయితే ఏమైందో ఏమో ఆ పుకార్లు ఆగిపోయాయి. ఆమె సినిమా ఈవెంట్లకు బాగానే హాజరైంది. ఇంటర్వ్యూలు లాంటివి ఇవ్వలేదు కానీ.. ప్రచారంలో మాత్రం పాల్గొంది. దీంతో అంతా సమసిపోయిందా అని అనుకున్నారంతా.

Jahnavi Kapoor

సినిమా విడుదల కూడా అయిపోయింది. టాక్‌ సంగతి అటుంచితే రామ్‌చరణ్‌ పాత్రకు పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. తొలి రోజు వసూళ్లు కూడా భారీగానే వచ్చాయి అని చెబుతున్నారు. ఆ విషయాలు అటుంచితే ఈ లోపు జాన్వీ కపూర్‌ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మరాఇంది. అదే ఆమె ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుకు లైక్‌ కొట్టడం. ‘పెద్ది’ సినిమా గురించి ఓ ఇన్‌స్టా పేజీలో పెట్టిన రివ్యూను జాన్వీ కపూర్‌ లైక్‌ చేసింది. అందులో తప్పేముంది అనుకుంటున్నారు.

‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్‌ పాత్రకు సరైన ప్రాధాన్యం దక్కలేదని ఆ రివ్యూలో రాశారు. ‘పెద్ది’ భారతీయ సినిమా చరిత్రలో ఒక కథానాయికకు జరిగిన అత్యంత అవమానం అని ఆ పోస్టులో పెట్టారు. దీన్ని జాన్వీ లైక్ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. తన పాత్రకు ప్రాధాన్యం దక్కలేదని జాన్వీ స్వయంగా సమర్థించిందిన అంటూ ఆమె లైక్‌ చేసిన పోస్టు స్క్రీన్‌ షాట్‌ను తెగ షేర్‌ చేస్తున్నారు. మరోవైపు ఆమె ఆ పోస్టుకు లైక్‌ను తీసేశారు. కానీ స్క్రీన్‌షాట్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

సినిమా టీమ్‌ మీద కోపానికే ఆమె ఇలా చేసింది అని కొందరు అంటుంటే.. పొరపాటున ఆమెనో లేక ఆమె సోషల్ మీడియా టీమ్‌ ఇలా చేసి ఉండొచ్చు అని మరికొందరి సమాచారం. అయితే పాత్ర గురించి అంతగా ఆలోచించే రకం జాన్వీ కాదు. ఎందుకంటే ఆమె తొలి తెలుగు సినిమా ‘దేవర’లో కూడా ఆమె పాత్ర ఇలానే తక్కువ ప్రాధాన్యంతో ఉంటుంది. మరి అప్పుడు ఆమె ఇలా అనుకోలేదు కూడా.

 ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus