Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Advertisement

‘చార్మింగ్ స్టార్’ శర్వానంద్(Sharwanand) ఈ ఏడాది సంక్రాంతికి ‘నారి నారి నడుమ మురారి’ అంటూ వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అలాగే ఇటీవల వచ్చిన ‘బైకర్’ కూడా బాగానే ఆడింది అని చెప్పాలి. ఇదే జోష్ తో శర్వానంద్ ఇప్పుడు మరో రెండు ప్రాజెక్టులతో బిజీగా మారాడు.

Sharwanand

ఆల్రెడీ సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న ‘భోగి’ సెట్స్ పై ఉంది. అలాగే సీనియర్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాస్తవానికి ఈ ప్రాజెక్టుని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించాలి.

భాను- నందు వంటి రైటర్స్ తో స్క్రిప్ట్ ను కూడా దగ్గరుండి డెవలప్ చేయించారు. మరి చివరిలో ఏమైందో ఏమో.. వారు ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడం జరిగింది.

తర్వాత వేరే నిర్మాతల కోసం ప్రయత్నించారు శర్వా- శ్రీను వైట్ల. ఒక దశలో ఓ కొత్త ప్రొడ్యూసర్ ముందుకి రావడం, తర్వాత ఆయన కూడా వెనక్కి తగ్గడం జరిగిందట. ఫైనల్ గా ఈ ప్రాజెక్టుని అనిల్ సుంకర టేకప్ చేసినట్టు స్పష్టమవుతుంది. ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాని నిర్మించింది అనిల్ సుంకరనే..! అంతకు ముందు శర్వాతో ‘మహాసముద్రం’ కూడా చేశారు.మరోవైపు శ్రీనువైట్ల- అనిల్ సుంకరకి కూడా మంచి బాండింగ్ ఉంది. వీరి కాంబోలో ‘నమో వెంకటేశ’ ‘దూకుడు’ ‘ఆగడు’ వంటి సినిమాలు వచ్చాయి.

కాబట్టి.. శర్వా- శ్రీను వైట్ల ప్రాజెక్టుని నిర్మించేందుకు ముందుకు వచ్చినట్టు అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా కథ.. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో కూడుకుని ఉంటుంది అని అంటున్నారు. ఈ సినిమాకి కూడా శర్వానంద్ ఎటువంటి పారితోషికం తీసుకోకుండా ప్రాఫిట్ షేరింగ్ (లాభాల్లో వాటా) పద్ధతిలో పనిచేయబోతున్నట్టు సమాచారం.జూలై నెలలో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మే ఎండింగ్లో ఈ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పొచ్చు.

‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus