ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మూడో తరం హీరోగా జయకృష్ణ ఘట్టమనేని ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరు ‘శ్రీనివాస మంగాపురం'(Srinivasa Mangapuram) సూపర్ స్టార్ కృష్ణ పెద్ద మనవడిగా, మహేష్ బాబు అన్న రమేష్ బాబు తనయుడిగా జయకృష్ణ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘వైజయంతీ మూవీస్’ ప్రతిష్టాత్మకంగా జయకృష్ణని లాంచ్ చేయనుంది. అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకుడు. మోహన్ బాబు స్పెషల్ రోల్ చేయగా రవీనా టాండన్ కుమార్తె రషా తడాని ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.
జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలో ‘అల్లెల్లె..’ పాట మంచి హిట్ అయ్యింది. టీజర్, ట్రైలర్ వంటివి ఎలా ఉన్నా.. పెద్ద ఫ్యామిలీ నుండి వస్తున్న హీరో కాబట్టి.. సినిమాపై స్పెషల్ ఫోకస్ పడింది. అయితే మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు వర్షాల కారణంగా.. జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ ను మాత్రమే రాబట్టింది. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :
| తెలంగాణ | 0.28 cr |
| సీడెడ్ | 0.16 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.39 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.83 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ | 0.12 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.95 cr (షేర్) |
‘శ్రీనివాస మంగాపురం’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.6 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.6.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.0.95 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.1.81 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కానీ బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.5.55 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.