Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌ వీడియో వైరల్‌

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుథ్‌ రవిచందర్‌.. ప్రముఖ వ్యాపారవేత్త, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ జట్టు యజమాని అయిన కావ్య మారన్‌ పెళ్లి త్వరలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇద్దరూ కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ ఎక్కడా అధికారికంగా సోషల్ మీడియాలో చెప్పలేదు. కానీ వారి వివాహ రిసెప్షన్‌కి కుటుంబ సభ్యులు ఆహ్వాన పత్రికలు అయితే పంచేస్తున్నారు. ఆ లెక్కన వారికి పెళ్లి ఫిక్స్‌ అయింది అని చెప్పొచ్చు.

Anirudh – Kaviya

ఎన్నో ఏళ్లు అనిరుథ్‌ – కావ్య బంధం గురించి వార్తలు వస్తున్నా ఎక్కడా క్లారిటీగా చెప్పలేదు. కొన్ని నెలల క్రితం అనిరుథ్‌ బంధువు ఒకరు ఈ విషయాన్ని బయట పెట్టారు. ఇప్పుడు పెళ్లి పత్రికల ద్వారా విషయం బయటకు వచ్చింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఆహ్వాన పత్రికలు రిసెప్షన్‌ కోసమే పంచుతున్నారు. ఎందుకంటే వీరి పెళ్లి వచ్చే నెలలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ తరహాలో జరుపుతున్నారట. నవంబరు 10, 11 తేదీల్లో గ్రీస్‌లో పెళ్లి ఉండబోతోందట.

నవంబరు 21న ఉన్న చెన్నైలో వెడ్డింగ్‌ రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇన్విటేషన్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓ బాక్స్‌ రూపంలో లేయర్లుగా, డోర్ల రూపంలో ఈ పత్రికను రూపొందించారు. అయితే లోపల ఏముంది అనేది తెలియదు. పై నుండి తీసిన వీడియో అయితే వైరల్‌ అవుతోంది. పెళ్లికి చాలా తక్కువ మందినే పిలుస్తున్నారని.. రిసెప్షన్‌ మాత్రం గ్రాండ్‌గా ఉండనుందట.

దీనికి తెలుగు రాష్ట్రాల సీఎంలు, తమిళనాడు సీఎంలు, ఇతర రాజకీయ ప్రముఖులు, సినిమా సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా హాజరవుతారని చెబుతున్నారు.

 వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus