ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ కథానాయకుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా/ అన్నా కొణిదెల కొన్ని నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఖాతా తెరిచిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్‌తో దిగిన ఫొటోలు షేర్ చేయడంతో మొదలైన ఆమె ఇన్‌స్టా జర్నీ.. ఆ తర్వాత ఆమె వ్యక్తిగత ఆసక్తులు, విషయాలు, ఆలోచనలు, అప్‌డేట్స్‌తో నిండిపోతూ వచ్చింది. రోజూ ఏదో పోస్టు పెడుతూ వచ్చారామె. జిమ్, తెలుగు నేర్చుకోవడం గురించి చెప్పారు. అయితే ఇప్పుడు ఆమె ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించడం లేదు.
ఏమైందా అని చూస్తే ఖాతా అందుబాటులో లేదు అని వస్తోంది. ఎవరైనా రిపోర్టులు కొట్టి ఖతా మూయించేశారా అంటే.. అలాంటి సమాచారం ఏదీ ఆమె ప్రొఫైల్ లింక్‌తో వెళ్తే రావడం లేదు. దీంతో సోషల్ మీడియా వేదింపుల కారణంగానే ఆమె ఖాతా మూసివేశారు అనే చర్చ మొదలైంది. అయితే సోషల్ మీడియా వేదింపులకే భయపడే రకం ఆమె కాదు అని గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల తెలుస్తోంది. దీంతో ఏమైంది అనే చర్చ అయితే జరుగుతోంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కూటమి, మరో పార్టీ మధ్య పోరులా నడుస్తున్నాయి. దీంతో అపోజిషన్ పార్టీ కార్యకర్తలో లేక సోషల్ మీడియా జనాలో ఆమెను ఏమన్నా అన్నారా అనేది తెలియడం లేదు. ఒకవేళ ఏమన్నా అంటే.. ఆమె ఆ విషయం సోషల్ మీడియాలోనే చెప్పేవారు. అలాంటిదేమీ చెప్పకుండా ఉన్నపళంగా అకౌంట్ మూసివేయడం వెనుక కారణమేంటో ఆమెనే చెప్పాలి. చూద్దాం ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో.
పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా సోషల్ మీడియాలో ఇలాంటి విమర్శలే ఎదుర్కొన్నారు. అయితే ఆమె మొండి ధైర్యంతో ముందుకుసాగుతూ ఖాతాను కొనసాగిస్తున్నారు. ఏదేమైనా అకౌంట్ అందుబాటులో లేకపోవడం వల్ల పవన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు అయితే మిస్ అవుతున్నాం. అలాగే అన్నా కొణిదెల తెలుగు నేర్చుకోవడానికి, ఫిట్‌నెస్ కోసం పడుతున్న శ్రమ కూడా తెలియడం లేదు.