Shah Rukh Khan, Salman Khan: షారుఖ్‌ vs సల్మాన్‌ కంటే ముందు… మరోసారి షారుఖ్‌ విత్‌ సల్మాన్‌!

  • February 21, 2024 / 11:19 AM IST

2023లో ఇండియన్‌ సినిమాలో రూ. వెయ్యి కోట్ల వసూళ్లు అందుకున్న సినిమాల లిస్ట్‌ తీస్తే రెండే కనిపిస్తాయి. ఆ రెండూ షారుఖ్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కినవే. అవే ‘జవాన్‌’, ‘పఠాన్‌’. తొలి సినిమా దక్షిణాది దర్శకుడు తెరకెక్కించగా… రెండోది హిందీ దర్శకుడే తీశారు. ఆ విషయం పక్కనపెడితే… అర్జెంట్‌గా అలాంటి మరో సినిమా కావాలని షారుఖ్‌ ఖాన్‌ అనుకుంటున్నారట. అంటే మరో రూ. వెయ్యి కోట్ల సినిమా పడాలని, అది కూడా వీలైనంత త్వరగా అనుకుంటున్నారని టాక్‌.

దీంతో ‘పఠాన్‌ 2’ సినిమాను పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని బాలీవుడ్‌ మీడియాలో వార్తలొస్తున్నాయి. ‘‘ఒక సోల్జర్‌ ఎప్పుడూ దేశం తన కోసం ఏం చేసిందని అడగడు. దేశం కోసం తనేం చేయగలడని ఆలోచిస్తాడు’’ అంటూ షారుఖ్‌ ఖాన్‌ ‘పఠాన్‌’తో అదరగొట్టాడు. ఇప్పుడు మరోసారి అదే పని చేయబోతున్నాడంటున్నారు. భారీ యాక్షన్‌ చిత్రంగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ ‘పఠాన్‌’ను రూపొందించారు. అందుకే రూ. 1050 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.

షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) సినీ జీవితంలో ఓ మైలురాయిగా నిలిచిన ఈ సినిమాకు కొనసాగింపుగా ‘పఠాన్‌ 2’ తీసుకురావాలని చూస్తున్నారట సిద్ధార్థ్‌ ఆనంద్‌. ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ కూడా ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు ‘పఠాన్‌’ లోనూ కనిపించిన విషయం తెలిసిందే. టైగర్‌, పఠాన్‌ మధ్య జరిగే సంఘర్షణకు ఈ ‘పఠాన్‌ 2’ పునాది లాంటిది అని టీమ్‌ చెబుతోంది. అంటే తర్వాత తీస్తామని చెబుతున్న ‘టైగర్‌ వర్సెస్‌ పఠాన్‌’కు ఈ సినిమా చాలా కీలకం అని అంటున్నారు.

ఆదిత్య చోప్రా బృందం గతేడాది నుండే ఈ కథను సిద్ధం చేస్తోందని టాక్‌. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది డిసెంబరులో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తారు అనే డౌట్‌ రావొచ్చు. మ్యాగ్జిమమ్‌ ‘పఠాన్‌’ సినిమాలో ఉన్న నటీనటులే ఈ సినిమాలోనూ ఉంటారు అని చెప్పొచ్చు. త్వరలో ఈ విషయంలోనూ క్లారిటీ వ్తుంది.

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus