టాలీవుడ్‌కి రానున్న మరో మలయాళ చిత్రం… ‘కుర్రాళ్ల’ జోరు అదుర్స్‌!

మలయాళ సినిమాల్లో ఏదో మత్తు ఉందబ్బా! ఈ మాట మేం అనేది అక్కడ సినిమాల్ని ఇక్కడ అదే భాషలో రిలీజ్‌ చేసినా, డబ్బింగ్‌ చేసినా, ఆఖరికి రీమేక్‌ చేసినా ఆ కథను అంతలా మెచ్చుకుంటూ ఉంటారు సినిమా జనాలు. నిజానికి ఆ సినిమాలు కూడా అలానే ఉంటాయి లెండి. ఇప్పుడు ఎందకు ఈ టాపిక్‌ వచ్చింది అనుకుంటున్నారా? ఇటీవల రిలీజైన మరో మాలీవుడ్‌ మూవీ సాధించిన విజయం గురించి చెబుదామని. అక్కడ కుర్రాళ్లకు బాగానే నచ్చేసిన ఆ సినిమా డబ్బింగ్‌ వెర్షన్‌ను మన దగ్గరకు తీసుకురండి అని సినీ గోయర్స్‌ అంటున్నారు కాబట్టి.

మాలీవుడ్‌ నుండి ఫిబ్రవరిలో నాలుగు బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చాయి. మొదటి వారంలో టొవినో థామస్‌ థ్రిల్లర్‌ సినిమా ‘అన్వేషిప్పిన్‌ కండేదుం’ విడుదలై మంచి టాక్‌ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా మూడు వారాలు ‘ప్రేమలు’, ‘భ్రమయుగం’ వచ్చాయి. తొలి సినిమా ఇక్కడ కూడా విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. ఇక ఆఖరిదైన ఈ వారం ‘మంజుమ్మెల్ బాయ్స్’ అనే సినిమాను రిలీజ్‌ చేశారు. దీనికి కూడా భారీ వసూళ్లే వస్తున్నాయి. ‘ప్రేమలు’ తరహాలోనే ఇది కూడా యూత్‌ఫుల్‌ సినిమానే.

అందరూ కొత్త వాళ్లతో రూపొందించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగునాట (Malayalam) మలయాళ వెర్షన్‌లో మంచి పేరే తెచ్చుకుంటోంది. సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను మార్చి 15న తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. పెద్ద బ్యానరే ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను తీసుకురాబోతోందట. దీంతో త్వరగా తీసుకొచ్చేయండి బాబూ అని సినీ గోయర్స్‌ కోరుతున్నారు. ఒకప్పుడు డబ్బింగ్‌ విషయంలో మన వాళ్ల దృష్టంతా తమిళ చిత్రాల మీదే ఉండేది.

అక్కడ విజయం సాధించిన ప్రతి సినిమానూ తెలుగులోకి తెచ్చేసేవారు. ఒక్కోసారి ఫ్లాప్ సినిమాలు కూడా డబ్‌ అయ్యేవి. అయితే కరోనా – లాక్‌డౌన్‌ – ఓటీటీల వల్ల మలయాళ సినిమాలు మనకు బాగా దగ్గరయ్యాయి. దీంతో అక్కడి సినిమాలను తెలుగులోకి నేరుగా తీసుకొస్తున్నాయి. లేదంటే డబ్‌ చేస్తున్నారు.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus