RRR Movie: ఫ్రెండ్షిప్ డే రోజు అంతకంటే ఎక్కువ!

  • July 14, 2021 / 03:20 PM IST

ఇండియన్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా చరిత్ర తిరగరాయడానికి సిద్దమవుతున్న సినిమాల్లో RRR కూడా ఉంది. బాహుబలి రికార్డును ఈ సినిమా బ్లాస్ట్ చేయగలదని ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలతోనే ఒక క్లారిటీ వచ్చేసింది. సినిమా నాన్ థియేట్రికల్ గానే దాదాపు పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చేసింది. ఇక ప్రస్తుతం వారి ఫోకస్ మొత్తం ప్రమోషన్ పై పడింది. గురువారం సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

రొర్ ఆఫ్ RRR పేరుతో సినిమాలోని కీలక షూటింగ్ సన్నివేశాలను ప్రజెంట్ చేయబోతున్నారు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. అయితే పెద్దగా గ్యాప్ లేకుండా మరో సర్ ప్రైజ్ కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 1న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆఫ్ స్క్రీన్ సీన్స్ ను కూడా చూపించనున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కూడా తెరవెనుక ఎంత క్లోజ్ గా ఉన్నారు అనే సీన్స్ ను కూడా చూపిస్తారట.

అందుకు సంబంధించిన వీడియో కూడా రెడీగా ఉన్నట్లు సమాచారం. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల్లో నటిస్తున్న ఈ ఇద్దరు స్టార్స్ అభిమానుల్లో అంచనాలను గట్టిగానే పెంచేశారు. ఇక ఆ వీడియోతో సినిమాపై మరింత అంచనాలు పెరగడం పక్కా అని చెప్పవచ్చు. పరిస్థితులు అనుకూలిస్తే అక్టోబర్ 13న సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus