నాని హీరోగా వచ్చిన ‘మజ్ను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అను ఇమ్మాన్యుయల్. మొదటి చిత్రంతోనే మంచి నటి అనిపించుకున్న ఈ బ్యూటీ … అతి తక్కువ టైంలోనే పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ ల ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో నటించే అవకాశం కొట్టేసింది. అదే తరుణంలో అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య’ సినిమాలోనూ ఈమె అవకాశం ధక్కించుకుంది. అయితే ఆ సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఈమెకు పెద్దగా కలిసి రాలేదు.
పైగా ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా ఈమె పై పడింది. అయినా సరే నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో అవకాశం ధక్కించుకుంది. కానీ ఆ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. దీంతో ఈమెకు అవకాశాలు అస్సలు రావడం లేదు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’ చిత్రంలో నటిస్తుంది.కానీ అందులో ఈమెది చిన్న పాత్రే అని తెలుస్తుంది. పైగా సినిమాలో ఆ పాత్రకి అంత ప్రాముఖ్యత కూడా ఉండదట.
దీంతో ఇక వెబ్ సిరీస్ లలో నటించడానికి రెడీ అవుతుంది. బోల్డ్ పాత్రలకు సైతం ఈమె ఓకే చెబుతుందట. గ్లామర్ షో కి కూడా ఏమాత్రం అడ్డు చెప్పను అని చెబుతుందట. ఎంత అవకాశాలు రాకపోతే మాత్రం ఇన్ని ఓపెన్ ఆఫర్లు ఇచ్చెయ్యాలా అంటూ దర్శక నిర్మాతలు సైతం ఆశ్చర్యపోతున్నట్టు వినికిడి.
Most Recommended Video
మేకప్ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్మగల్ వందాల్’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!