Anudeep: అనుదీప్‌ కొత్త సినిమాకు యాక్షన్‌ మిక్స్‌ చేస్తాడట!

  • April 7, 2021 / 12:02 PM IST

మీరు జాకీ చాన్‌ సినిమాలు చూశారా.. ఫుల్ ఫైట్లు, యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉంటూనే నవ్విస్తుంటారు. యాక్షన్‌ – కామెడీ అనే జోనర్‌ వచ్చిందంటేనే జాకీ జాన్‌ సినిమాలతో అంటుంటారు సినిమా జనాలు. ఇప్పుడు ఆ జోనర్‌ తెలుగులోకి కూడా రాబోతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ‘జాతిరత్నాలు’సినిమాతో తనేంటో నిరూపించుకున్న అనుదీప్‌ ఈ కొత్త జోనర్‌ను టాలీవుడ్‌కి తెచ్చే యోచనలో ఉన్నాడట. తన తర్వాతి సినిమాగా దీనినే ఎంచుకున్నాడని టాక్‌.

‘జాతిరత్నాలు’ విడుదలై ఇన్ని రోజులైనా అనుదీప్‌ నుండి కొత్త సినిమా ప్రకటన ఇంకా రాలేదు. తొలి సినిమా నిర్మించిన స్వప్న సినిమా బ్యానర్‌లోనే తర్వాతి సినిమా కూడా ఉంటుంది అనే ఒక్క విషయమే బయటకు వచ్చింది. అయితే తర్వాతి సినిమా కోసం వైష్ణవ్‌ తేజ్‌, రామ్‌కు కథ చెప్పాడని వార్తలొచ్చాయి. వైష్ణవ్‌ కొత్త సినిమా ఇటీవల ప్రారంభం అయిన నేపథ్యంలో రేసులోంచి వైష్ణవ్‌ పక్కకు వెళ్లిపోయాడు. ఇక మిగిలింది రామ్‌. మరి రామ్ ఓకే చేస్తాడో లేదో చూడాలి.

జాకీ చాన్‌ సినిమాల్లా మార్షల్‌ ఆర్ట్స్‌లో యాక్షన్‌ సీన్స్‌ చేస్తూనే, తనదైన శైలిలో నవ్వించేలా అనుదీప్‌ కొత్త సినిమా రాసుకున్నాడని అంటున్నారు. మరి ఇందులో హీరో ఎవరు, హీరోయిన్‌ ఎవరు అనేది తెలియడం లేదు. అయితే ‘జాతిరత్నాలు’ హీరో నవీన్‌ పొలిశెట్టితో ఓ సినిమా ఉంటుందని గతంలోనే చెప్పాడు అనుదీప్‌. దీంతో అసలు ఏ సినిమా ముందు మొదలవుతుందనేది తెలియడం లేదు.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus