Anupama Parameswaran: ఆ సినిమాతో అనుపమ ఆశలు తీరతాయా?

  • October 14, 2021 / 11:49 AM IST

తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం అనుపమ పరమేశ్వరన్ భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అందం, అభినయం ఉన్న ఈ హీరోయిన్ తెలుగులో 18 పేజెస్, కార్తికేయ2 సినిమాలలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. వరుసగా నిఖిల్ సినిమాల్లో ఆఫర్స్ కొట్టేసిన ఈ బ్యూటీ నటించిన రౌడీ బాయ్స్ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. అయితే తమిళంలో మాత్రం అనుపమ ఎక్కువ సినిమాల్లో నటించలేదు.

కొడి సినిమాలో నటించిన అనుపమ ఐదు సంవత్సరాల గ్యాప్ తర్వాత తళ్లి పోగాదే అనే కోలీవుడ్ సినిమాలో నటించారు. ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నిన్ను కోరి రీమేక్ కావడం గమనార్హం. ఈ సినిమాలో అధర్వ మురళి హీరోగా నటించారు. తళ్లి పోగాదే కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తెలుగులో నిన్ను కోరి సినిమాలో నాని, నివేదా థామస్ హీరోహీరోయిన్లుగా నటించగా ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటించారు.

మరోవైపు అనుపమ ఇప్పటివరకు నటించిన రీమేక్ సినిమాలన్నీ హిట్ అయ్యాయనే సంగతి తెలిసిందే. తళ్లి పోగాదే సినిమాతో అనుపమ ఖాతాలో నాలుగో హిట్ చేరుతుందేమో చూడాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. మరోవైపు తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో అనుపమకు ఎక్కువగా ఛాన్స్ లు రావడం లేదు. 18 పేజెస్ సక్సెస్ సాధిస్తే మాత్రమే తెలుగులో అనుపమ వరుస ఆఫర్లతో బిజీ అయ్యే ఛాన్స్ ఉంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus