Anushka: పిక్‌ టాక్‌: ప్రభాస్‌తో ఈ లుక్‌లో అనుష్క నటిస్తేనా… థియేటర్లలో రచ్చ రచ్చే!

ఫిగర్‌, అట్రాక్టివ్‌నెస్‌, కాస్త బొద్దుతనం… ఇలా ఓ టాలీవుడ్‌ హీరోయిన్‌కి కావాల్సిన లక్షణాలు ఉన్న కథానాయిక అనుష్క శెట్టి (Anushka Shetty) . ‘సూపర్‌’ (Super) సినిమాతో ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు నెక్స్ట్ స్టార్‌ హీరోయిన్‌ అనే ట్యాగ్‌ ఇచ్చేశారు. అనుకున్నట్లే ఆ సినిమా తర్వాత ఆ ఫలితంతో సంబంధం లేకుండా అనుష్క స్టార్ అయిపోయింది. ఆ స్టేటస్‌ అనుభవించే విషయంలో మాత్రం ఆమె ఫెయిల్‌ అయ్యిందని చెప్పాలి. వివిధ కారణాల వల్ల ఆమె లావెక్కడంతో సినిమాలు తగ్గిపోయాయి.

ఆమె తగ్గించేసిందో, లేక అవకాశాలే రాలేదో తెలియదు కానీ… అనుష్క అయితే తెలుగు సినిమాకు దూరమైంది. అయితే ఆమెను మిస్‌ అవుతున్నవాళ్లకు గుడ్‌ న్యూస్‌. మళ్లీ స్లిమ్‌ లుక్‌లో అనుష్క దర్శనమించ్చింది. గతంలో ఎలా ఉండేదో అలా కనిపించి వావ్‌ అనిపించింది. దీంతో కుర్రకారు ఆమె ఫొటోలకు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. ఆమె రీసెంట్‌ మూవీ ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr. Polishetty) ప్రమోసన్స్‌లో కూడా బయటకు రాని అనుష్క ఇప్పుడు వచ్చింది. అలా వచ్చినప్పుడు క్లిక్‌ మనిపించిన ఫొటో టాకే ఇది.

అనుష్క బయట కనిపించి చాన్నాళ్లయింది. కొన్నాళ్లుగా అధిక బరువు సమస్యతో బాధపడుతుండటంతో బయటకు రావడం లేదు అంటున్నారు. బరువు తగ్గడానికి ప్రయత్నాలేవీ ఫలించలేదని అని అంటున్నారు. ఆ మధ్య రెండు మూడుసార్లు బయటకొచ్చినప్పుడు అనుష్క ఫిజిక్‌పై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దీంతో పూర్తిగా కనిపించడం మానేసింది. అయితే ఇటీవల ఆమె ఓ మలయాళం సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.

ఆ సినిమా సెట్స్‌లోకి ఇటీవల జాయిన్‌ అయ్యింది అనుష్క. ఆ సందర్భంగా యూనిట్ ఆమెకు స్వాగతం పలికారు. ఆ ఫొటోలు ఇప్పుడు బయటకొచ్చాయి. వాటిలో అనుష్క సన్నబడినట్టు కనిపించింది. దీంతో ఫ్యాన్స్‌ హ్యాపీ ఫీలవుతున్నారు. ఇప్పుడు ఆమె తగ్గింది కాబట్టి… ఇక వరుస సినిమాలు ఓకే చేస్తుంది అంటున్నారు. ఆ లెక్కన ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తే… ఆ కాంబోను తెరపై చూసి మురిసిపోయి రచ్చ రచ్చ చేయాలనేది ఫ్యాన్స్‌ కోరిక.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus