Ajith: స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?

ప్రముఖ కథానాయకుడు అజిత్‌ కుమార్‌ (Ajith Kumar) ఆరోగ్యం గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏమైందో క్లారిటీ లేకపోయినా.. ఏదో ఒకటి చెబుతూ, అదేదో పెద్ద ఇబ్బంది అనేలా వార్తలు వచ్చేశాయి. అయితే అజిత్‌ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడు ఫుల్‌ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఆయన ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్‌ అయ్యారు. కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అజిత్‌ ఇటీవల చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు.

అయితే ఈ విషయం నేరుగా తెలియకుండా దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు రావడంతో అజిత్‌ ఆరోగ్యంపై రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి. ఏకంగా బ్రెయిన్‌ సర్జరీ అంటూ కొంతమంది పుకార్లు షికార్లు చేయించారు. మరికొంతమంది ఏమైందో అంటూ ప్రశ్నలు రేపి ఇంకాస్త ఇబ్బంది పెట్టారు. దీంతో అభిమానుల్లో ఆందోళన పెరిగింది. తాజాగా అజిత్‌ అనారోగ్య వార్తలపై అజిత్‌ వ్యక్తిగత సిబ్బంది క్లారిటీ ఇచ్చారు.

సాధారణ వైద్య పరీక్షల కోసం అజిత్‌ ఆస్పత్రిలో చేరారని, పరీక్షలు నిర్వహించిన వైద్యులు చెవి వెనక ఉన్న నరాలు బలహీనంగా ఉన్నాయని తెలిపారని టీమ్‌ చెప్పారు. చెవి వెనుక నరాలకు చికిత్స చేశారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. అజిత్‌ ఆస్పత్రి నుండి ఇంటికి చేరుకున్నారని, ఇప్పటివరకూ ఆయన అనారోగ్యంపై వచ్చిన వార్తల్లో నిజం లేదని తేల్చేశారు. అంతేకాదు ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదని, దయచేసి ఇలాంటి పనులు చేయొద్దని కోరారు.

దీంతో అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం (Magizh Thirumeni) మళిళ్‌ తిరుమేని దర్శకత్వంలో ‘విదా ముయార్చి’ అనే సినిమాలో అజిత్‌ నటిస్తున్నాడు. త్రిష (Trisha) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో (Arjun Sarja) అర్జున్‌ సర్జా, (Regina) రెజీనా కూడా నటిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా మీద అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. అయితే అనారోగ్యం కారణంగా సినిమా ఆలస్యం అవ్వొచ్చు అంటున్నారు.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus