Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండదు.. పబ్లిక్ ఈవెంట్స్‌లో అస్సలు కనిపించదు.. కనీసం కొత్త సినిమాల అనౌన్స్‌మెంట్స్, గాసిప్స్ కూడా లేవు. టాలీవుడ్ ‘స్వీటీ’ అనుష్క శెట్టి గురించి ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న.. ‘అసలు ఆమె ఏమైపోయింది?’ అని.నెక్స్ట్ సినిమా చేస్తుందా?

Anushka

గతేడాది సెప్టెంబర్‌లో వచ్చిన ‘ఘాటి’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. అంతకుముందు నవీన్ పొలిశెట్టితో చేసిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ పర్వాలేదనిపించినా.. ‘ఘాటి’ డిజాస్టర్ ఆమె కెరీర్‌పై గట్టి ప్రభావమే చూపింది. నిజానికి అనుష్కకు నాన్-థియేట్రికల్ మార్కెట్ (ఓటీటీ, శాటిలైట్) ఇప్పటికీ చాలా స్ట్రాంగ్. కానీ, థియేట్రికల్ బిజినెస్ మాత్రం కాంబినేషన్, రిలీజ్‌కు ముందున్న హైప్ పైనే డిపెండ్ అవుతోంది. ‘ఘాటి’ రిజల్ట్ తర్వాత ఆమె పూర్తిగా సైలెంట్ అయిపోయింది.

‘బాహుబలి’తో పాన్ ఇండియా రేంజ్‌కు వెళ్లిన అనుష్కను.. గత కొన్నేళ్లుగా ఓవర్ వెయిట్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. బరువు తగ్గేందుకు ఆమె ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. మధ్యలో రెండు వెబ్ సిరీస్‌లకు సంబంధించి చర్చలు జరిగినా.. అవి వర్కౌట్ కాలేదు. ఏదో ఒక సినిమా చేసేయాలనే కంగారు ఆమెకు అస్సలు లేదు. స్క్రిప్ట్ వంద శాతం మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటేనే కెమెరా ముందుకు రావాలని ఆమె డిసైడ్ అయిందట.

కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే అనుష్క చాలా తెలివిగా హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో భారీగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసింది. కాబట్టి ఇప్పుడు వరుస సినిమాలు చేయాలనే ఫైనాన్షియల్ ప్రెజర్ ఆమెకు ఏమాత్రం లేదు. ప్రస్తుతానికైతే స్వీటీ సినిమాలకు కంప్లీట్ బ్రేక్ ఇచ్చింది. ఆమె కమ్‌బ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నా.. ఇప్పట్లో కొత్త ప్రాజెక్ట్ మొదలయ్యే ఛాన్స్ అయితే కనిపించడం లేదు.

 ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags