అమెరికా వెళ్ళబోతున్న అనుష్క.. కారణం అదే..!

‘బాహుబలి2’, ‘భాగమతి’ చిత్రాల తర్వాత మరే చిత్రంలోనూ అనుష్క కనిపించలేదు. అనుష్క చివరిగా నటించిన ‘భాగమతి’ చిత్రం 2018 లో విడుదలయ్యింది. ప్రస్తుతం అనుష్క ‘సైలెన్స్’ అనే మూవీలో నటిస్తుంది. హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు మాధవన్ హీరోగా నటిస్తున్నాడు. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి,షాలినీ పాండే కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎక్కువశాతం అమెరికాలో చిత్రీకరించబోతున్నారు.

అయితే పాస్ పోర్ట్ సమస్య వల్ల అనుష్క ఇప్పటివరకూ అమెరికా వెళ్ళలేదు. ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది కాబట్టి అమెరికా పయనమవ్వబోతుంది అనుష్క. ఆమెతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు మొత్తం అమెరికా వెళ్ళబోతున్నారట. కోనవెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ్ మరియు హిందీ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంకోసం అనుష్క విదేశాలకు వెళ్ళి సహజ సిద్దమైన వైద్యం తీసుకుని సన్నగా మారింది అనుష్క. కథ డిమాండ్ చేయడం వలనే అనుష్క ఇలా స్లిమ్ అయ్యిందట. మరి అనుష్క ఇంత కష్టపడుతున్న ఈ చిత్రం ఆమెకు ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus