Anushka: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో అనుష్క పాత్రను వదులుకున్న హీరోయిన్ ఎవరంటే?

  • September 8, 2023 / 06:10 PM IST

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది అనుష్క. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ ప్రేక్షకులు జేజమ్మగా పిలుచుకుంటున్నారు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయినగా పాపులారిటీ సంపాదించుకుంది అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి. తను ఈ మధ్య ఎందుకో గానీ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. లేటెస్ట్ గా హీరోయిన్ గా నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. అవుట్ అండ్ అవుట్ ఫుల్ కామెడీ సినిమా ఇది. నేడు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

మరో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరీ సినిమాల్లో కామెడీని మించి పోయిందని ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందుక వచ్చిన టీజర్, పాటలతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా అనుష్క ఈసారి ప్రత్యేక పాత్రలో కనిపిస్తుండడం అభిమానులకు చాలా సర్ ప్రైజ్ గా ఉంది. విడుదలకు ముందు ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో అనుష్క ని చూద్దామా ..? అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేశారు. వారి వెయిటింగ్ నేటితో తీరిపోయింది.

కామెడీలో నవీన్ పొలిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏ సినిమాలో నటించిన నవ్వుల పంట పండించాల్సిందే. అయితే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో దర్శకుడు ముందుగా అనుష్క కంటే ముందు మరో హీరోయిన్ ను అనుకున్నారట. కానీ ఆమె ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట. నేనో స్టార్ హీరోయిన్ ను ఇలాంటి చీప్ పాత్రలో చేయలేనంటూ సున్నితంగా రిజెక్ట్ చేసిందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు నేషనల్ క్రష్ గా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.

ఆమె వద్దకే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కథ తొలుత వెళ్లిందట. కానీ అప్పటికే నేషనల్ క్రష్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలేస్తున్న రష్మిక ఇలాంటి పాత్రలో కనిపిస్తే అభిమానులు ఇష్టపడరని.. అది నెగిటివ్ గా వెళ్లే ఛాన్సులు ఉన్నాయని తెలిసి ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత ఈ పాత్ర కోసం ఎంతోమంది హీరోయిన్స్‎ను కలిసినా సెల్ అవ్వలేదట. ఫైనల్ గా జేజమ్మ సినిమాను ఓకే చేసిందట. ఏది ఏమైనా సినిమాలో మాత్రం అనుష్క (Anushka) బాగా సెట్ అయిందని ఫ్యాన్స్ కితాబు ఇస్తున్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus