బిగ్ బాస్ హౌస్ లో ఫైనల్ వీక్స్ లో పార్టిసిపెంట్స్ తమ ఫ్రస్టేషన్ ని చూపిస్తున్నారు. అవినాష్ విషయంలో అరియానా మోనాల్ పగ తీర్చుకుంటోంది అని నిందిస్తే, మోనాల్ అరియానికి ఇష్టమైన టెడ్డీ బేర్ ని పైకి విసిరేసి తన గేమ్ తను ఆడింది. ఇక్కడే అరియానా అన్నమాటలకి, తను గేమ్ లో ఓడిపోయినందుకు భోరున ఏడ్చింది మోనాల్. మోనాల్ కి ఏడుపు కొత్తకాకపోయినా, చూసే ప్రేక్షకులకి కొత్తకాకపోయినా, ఈరకమైన ఏడుపు మాత్రం కొత్తగానే అనిపించింది. బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి మరీ ధైర్యం చెప్పేంతగా ఏడ్చింది మోనాల్. పైనల్ వీక్స్ లో ఇలా ఒక్క మోనాల్ మాత్రమే కాదు. అరియానా, సోహైల్ లు కూడా నువ్వా నేనా అన్నట్లుగా అరుచుకున్నారు.
ఓపిక అనే టాస్క్ లో అస్సలు ఓపిక లేకుండా రెచ్చిపోయారు ఇద్దరూ. రీసంట్ గా వచ్చిన ప్రమోలో సోహైల్ గట్టిగా అరుస్తుంటే, అరియానా గట్టిగట్టిగా అరుస్తూ ఫైనల్ గా అభిజిత్ ని పట్టుకుని ఏడ్చేసింది. ప్రోమోలో హారిక ఓపిగ్గా కూర్చుని ఉన్నప్పుడు మోనాల్ విషయంలో వీళ్లిద్దరీక ఆర్గ్యూమెంట్ జరిగింది. సోహైల్ అండ్ అరియానా ఇద్దరూ కూడా నువ్వా నేనా అన్నట్లుగా అరుచుకున్నారు. సోహైల్ మోనాల్ విషయంలో అరియానాపై ఎదురుదాటికి దిగాడు. బొమ్మకి వాల్యూ ఇచ్చావ్ కానీ మనిషికి వాల్యూ ఇవ్వలేదు నువ్వు అంటూ మాట్లాడాడు. దీంతో అరియానాకి బాగా కోపం వచ్చింది. దీనివల్ల ప్రాబ్లమ్ ఎవరికి వచ్చింది అని అడిగితే, ఆపబ్బా అన్నాడు సోహైల్. దీనికి ఆన్సర్ గా నువ్వు ఆపరా అంటూ అరియానా రెచ్చిపోయింది.
మాటా మాట పెరిగింది.. నువ్వు అరవక్ .. అంటే నువ్వు అరవక్ అంటూ రెచ్చిపోయారు ఇద్దరూ. ఫైనల్ గా అరియానా బాగా ఎమోషనల్ అయిపోయింది. గార్డెన్ లో కిందపడి భోరన ఏడ్చింది. ఇక పైనల్ వీక్స్ లో పార్టిసిపెంట్స్ తమ ఫ్రస్టేషన్ ని చూపిస్తూ రెచ్చిపోతున్నారు. దీనివల్ల ఈవారం ఓటింగ్ గ్రాఫ్ ఎలా మారుతుంది అనేది ఆసక్తికరం. మరిన్ని ఇంట్రస్టింగ్ బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఫిల్మీ ఫోకస్ ఛానల్ కి సబ్ స్క్రైబ్ అవ్వండి.
[yop_poll id=”1″]
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!