Ariyana: అరియానా జాతకం చెప్పిన టారో రీడర్ శాంతి..! హౌస్ మేట్స్ కి ఏం చెప్పిందంటే..?

  • May 17, 2022 / 10:46 AM IST

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ ఆఖరి వారంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా టారోట్ రీడర్ శాంతి హౌస్ మేట్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందని చెప్పారు. ముందుగా బాబాబాస్కర్ డైరెక్టర్ అవుతున్నామ్, అది ఎలా ఉంటుందని అడిగారు. దీనికి వర్రీ అవ్వొద్దని, విత్తనాలు బాగా వేశారని, హార్ట్ వర్క్ ఉంటుంది కానీ బాగా చేస్తారని చెప్పింది. అలాగే, మంచి లగ్జరీ లైఫ్ అనుభవిస్తారని చెప్పారు. ఇక అరియానా మ్యారేజ్ గురించి అడిగితే,

లవర్స్ కార్డ్ వచ్చిందని, ఈ నవంబర్ లోనే పెళ్లి అయిపోతుందని, లేదంటే జెర్నీ స్టార్ట్ అవుతుందని, ఆ పర్సన్ కూడా చాలా బ్యాలన్స్ పర్సన్ వస్తాడని చెప్పారు. అంతేకాదు, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తావని, మంచి నిర్ణయం తీస్కుంటావని, మీ లవర్ ని త్వరలోనే మీట్ అవుతావని చెప్పారు శాంతి. తర్వాత అనిల్ ఎరేంజ్ మ్యారేజ్ కి ఎక్కువ పాయింట్స్ వచ్చాయని, లవ్ మ్యారేజ్ కోసం చాలా హార్ట్ వర్క్ చేయాల్సి వస్తుందని చెప్పారు.

కానీ, ఎరేంజ్ మ్యారేజ్ అయితే మీకు చాలా బెటర్ అని, లవ్ మ్యారేజ్ అయితే అమ్మాయికి ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయని, అది హ్యాండిల్ చేయలేరని చెప్పారు. అలాగే, శివ వర్క్ పరంగా కెరియర్ ఎలా ఉంటుందని అడిగితే, శివకోసం కార్డ్స్ తీసి మరీ చాలా మంచి ఆలోచనలు చేయాలని చెప్పారు. ఎమోషనల్ బ్యాలన్స్ చేయాలని, చాలా మార్పులు వస్తాయని, కొత్త శివ బయటకి వస్తాడని, భయాన్ని- ఆందోళనని వదిలేయమని చెప్పింది.

బిగ్ బాస్ లో ఛాలెంజస్ ఉన్నట్లుగానే బయట కూడా ఛాలెంజస్ ఉంటాయని, అది గేమ్ లాగా చూడమని చెప్పారు. టారోట్ రీడర్ శాంతిని హౌస్ మేట్స్ ఎంటర్ టైన్ చేసిన తర్వాత మరోసారి అందరికీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది. ఎలాంటి హార్ట్ వర్క్ చేయాలని హౌస్ మేట్స్ కి చెప్పారు. హౌస్ మేట్స్ ఒక్కొక్కరు వచ్చి కార్డ్స్ తీశారు. ఆ కార్డ్స్ ప్రకారం వాళ్లు అడిగిన ప్రశ్నలకి ఆన్సర్స్ చెప్పారు. దీని తర్వాత హౌస్ మేట్స్ అందరూ కాసేపు ఫన్ చేశారు. ఆఖరి వారం అందరూ మేకోవర్ అవుతూ ఫినాలేకి రెడీ అవుతున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus