కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి టాలీవుడ్ గేమ్ చేంజెర్ గా నిలిచింది. యువ హీరో విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించిన ఈ సినిమా ఇక్కడ, అక్కడ అని తేడా లేకుండా అన్ని ఏరియాల్లో భారీ కలక్షన్స్ రాబట్టింది. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లో ప్రణయ్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల షేర్ రాబట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది. అదే జోష్ తో ద్విగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ వసూలు చేసి 50 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. షేర్ 25 .8 కోట్లుగా నమోదైంది. నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్స్ కి అర్జున్ రెడ్డి మంచి లాభాలను అందించాడు.
ఏరియాల వారీగా కలక్షన్స్ కోట్లలో (షేర్ ) …
నైజాం : 9.10
సీడెడ్ : 2.20
ఉత్తరాంధ్ర : 1 .55
ఈస్ట్ గోదావరి : 1.10
వెస్ట్ గోదావరి : 0.70
కృష్ణ : 1.15
గుంటూరు : 1.15
నెల్లూరు : 0.45
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం : 17 .40
అమెరికా : 5 .80
కర్ణాటక : 1 . 35
ఇతర ప్రాంతాల్లో : 1 .25
మొత్తం : 25 . 80