Ashu Reddy: డ్రగ్స్ కేసు వ్యవహారంలో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి!

టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది.గత కొంతకాలంగా సినిమా సెలబ్రిటీలకు ఈ డ్రగ్స్ కేసు ఏమాత్రం నిద్రలేకుండా చేస్తుందని చెప్పాలి. గతంలో పలువురు సెలబ్రిటీలు అందరూ కూడా విచారణకు హాజరైన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా మరోసారి కే పీ చౌదరి అరెస్టుతో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంలో భాగంగా పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. తీగలాకితే డొంక కదిలినట్లు నిర్మాత చౌదరిని అరెస్టు చేయడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీల పేర్లన్నీ కూడా బయటపడ్డాయి.

అయితే ఈ డ్రెస్ కేసు వ్యవహారంలో బిగ్ బాస్ బ్యూటీ (Ashu Reddy) అషు రెడ్డి పేరు కూడా తెరపైకి రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. తాజాగా అరెస్ట్ అయినటువంటి సినీ నిర్మాత కేపీ చౌదరి కస్టడీ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ రిపోర్టులో భాగంగా ఈయన సెలబ్రెటీలు, నేతల కుమారులకు డ్రగ్స్‌ విక్రయించారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈయన ఫోన్ కాల్ లిస్ట్ ను అధికారులు ఢీకోడ్ చేయడంతో బిగ్ బాస్ కంటెస్టెంట్ అషురెడ్డితో పాటు మరికొందరి పేర్లు కూడా బయటకు వచ్చాయి.

ఇందులో సినిమాలలో ఐటం సాంగ్స్ చేస్తున్నటువంటి ఒక నటి కూడా ఉండడం విశేషం. అయితే ఈ ఫోన్ కాల్స్ పై ఈయన ఎటువంటి సమాచారం ఇవ్వలేదు కానీ తాను 12 మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఒప్పుకోవడం గమనార్హం.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus