Ashu Reddy: నా అనుమతి లేకుండా అలా చేస్తే నేను అస్సలు క్షమించను: అషురెడ్డి

Advertisement

కబాలి నిర్మాత డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు అతన్ని రిమైండ్లో ఉంచి .. విచారించగా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది పేర్లు బయటపడినట్లు తెలుస్తోంది. అందులో బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి పేరు కూడా ఉండటంతో ఆమె పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. దీనిపై ఆమె రియాక్ట్ అయ్యి ఓ రేంజ్లో మండిపడింది.తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అషురెడ్డి ఈ విషయం పై స్పందించింది.

ఆమె (Ashu Reddy) మాట్లాడుతూ.. ” నాకు డ్రగ్స్‌కి ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయంలో నాకు ఎవరితోనూ ఎటువంటి సంబంధం లేదు. నా పై వస్తున్న వార్తల్లో నిజం లేదు. టైం వచ్చినప్పుడు ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యున్నారు అనేది నేను బయటపెడతా.! నా అనుమతి లేకుండా నా ఫోన్ నెంబర్ ప్రచారం చేస్తే క్షమించేది లేదు. నన్ను ఇలాంటి విషయాల్లోకి ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదు” అంటూ అషురెడ్డి చెప్పుకొచ్చింది.

కేపీ చౌదరి తో ఓ ఫిమేల్ బిగ్ బాస్ కంటెస్టెంట్ వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే విషయాన్ని వారు బయటకు చెప్పడం కూడా జరిగింది. కానీ నిన్న ఊహించని విధంగా టాలీవుడ్ కు చెందిన కొంతమంది ప్రముఖులతో పాటు అషురెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది. పైగా ఆమె ఇటీవల రాంగోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలను గుర్తుచేస్తూ ఇంకా ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అందుకే అషురెడ్డి ఇలా సీరియస్ అయినట్టు స్పష్టమవుతుంది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus