ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

వీడికి ముక్క లేనిదే ముద్ద దిగదు అంటుంటారు మనిళ్లలో. మీరు కూడా ఈ మాట మీ ఇంట్లోనో, లేక తెలిసినవాళ్ల ఇంట్లోనో ఈ మాట వినే ఉంటారు. ఎందుకంటే అలాంటోళ్లు చాలా మంది ఉన్నారు. ఒకవేళ మీరు కూడా అలాంటి బాపతే అయితే మీకు తోడుగా యంగ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ కూడా ఉన్నాడు. అవును ఆయనకు కూడా రోజూ ముక్క లేనిదే ముద్ద దిగదట. ఈ విషయాన్ని ఇటీవల ఆయనే చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Varun Tej

తన కొత్త సినిమా ‘కొరియన్‌ కనకరాజు’ సినిమా ప్రచారంలో భాగంగా వరుణ్‌ తేజ్ ఈ మధ్య వరుసగా ప్రచారంలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన ఫుడ్‌ ఇంట్రెస్ట్‌ల గురించి చెప్పాల్సి వచ్చింది. అప్పుడే తనకు ముక్క లేనిదే ముద్ద దిగదని చెప్పేశాడు. రెగ్యులర్‌గా తన డైట్‌లో చికెన్ కానీ మటన్ కానీ ఉండాల్సిందే అని చెప్పాడు. అలాగే చేపలు, పీతలు, రొయ్యలు కూడా బాగా లాగించేస్తానని చెప్పాడు.

నాన్‌ వెజ్‌ అంటే ఎంత ఇష్టమో చెబుతూ.. చిన్నప్పుడు ఓ పూట చికెన్ పెట్టలేదని ఆ రాత్రంతూ ఏడుస్తూ పడుకున్నాడట. ఆ రెండో రోజే పరీక్ష ఉన్నా ప్రిపేర్ అవ్వలేదు. ఫలితంగా ఆ పరీక్షల్లో వరుణ్‌ ఫెయిల్ అయ్యాడట. అలా చికెన్ లేకపోవడం వల్ల పరీక్ష తప్పానని నవ్వుతూ చెప్పాడు వరుణ్‌. నాన్‌ వెజ్‌ అంటే ఇంత ఇష్టం ఉన్న వరుణ్‌.. ఇటీవల ‘కొరియన్ కనకరాజు’ సినిమా కోసం దక్షిణ కొరియా వెళ్లాడు. అక్కడ 12 రోజులు ఉన్నాడు. ఈ క్రమంలో ఎన్ని రకాల నాన్‌ వెజ్‌ ట్రై చేసి ఉంటాడో మీరే అర్థం చేసుకోండి.

ఇక ‘కొరియన్‌ కనకరాజు’ సినిమా విషయానికొస్తే మేర్లపాక గాంధీ తెరకెక్కించిన సినిమా ఇది. రితికా నాయక్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఆగస్టు 7న విడుదలవుతుంది.

ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus