Dhanush: ‘జగమే తందిరం’ రిలీజ్‌ సందర్భంగా ట్వీట్లు!

  • June 18, 2021 / 01:08 PM IST

ఏంటీ… ఇతను హీరోనా… ధనుష్‌ను చూసిన తొలినాళ్లలో చాలామంది అన్న మాట ఇది. ఇలాంటోళ్లందరూ హీరోలు అంటూ వచ్చేస్తే ఇక ఇండస్ట్రీ పని అయిపోయేట్లే అనుకున్నవాళ్లూ ఉన్నారు. అయితే కామెంట్లు వింటే, వినిపించుకుంటే స్టార్లు అవ్వలేరు ఎవరూ. అయితే ఆ కామెంట్లు విని కసి పెంచుకుంటే కచ్చితంగా స్టార్లు అవుతారు. అలాంటి వారిలో ధనుష్‌ ఒకరు. అందుకే ఏకంగా హాలీవుడ్‌ సినిమా చేస్తున్నాడు. ఈ రోజు ధనుష్‌ ‘జగమే తందిరం’ విడుదల సందర్భంగా ఏకంగా హాలీవుడ్‌ దర్శకుల విషెస్‌ కూడా వచ్చాయి.

‘అవెంజెర్స్ ఎండ్‌ గేమ్‌’ తో ప్రపచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాను అందించి దర్శకుడు రుసో బ్రదర్స్‌ ఇటీవల ఓ ట్వీట్‌ చేశారు. ‘జగమే తందిరం’ విడుదల సందర్భంగా ‘సూపర్‌ తంబీ… నీతో కలసి పని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. నీ ‘జగమే తందిరం’ విడుదలవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు. ట్రైలర్‌ చూడండి’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు రుసో బ్రదర్స్‌. దీంతో ఆ ట్వీట్‌ వైరల్‌గా మారింది. రుసు బ్రదర్స్‌ ట్వీట్‌కు స్పందించిన ధనుష్‌ ‘ధన్యవాదాలు రుసో బ్రదర్స్‌.

మీ శుభాకాంక్షలు ఎంతో విలువైనవి’ అంటూ సమాధానమిచ్చాడు. వీటికి వేలల్లో లైక్‌లు వస్తున్నాయి. అసలు ధనుష్‌కి రుసో బ్రదర్స్‌ ఎందుకు విష్‌ చేశారు అనే డౌట్‌ మీకు రావొచ్చు. ఎందుకంటే వారితో ధనుష్ ఒక ఆంగ్లో ఇండియన్ సినిమా చేస్తున్నాడు. అదన్నమాట సంగతి. ఏదైతేముంది హాలీవుడ్‌ స్టార్ దర్శకుల విషెస్‌ అందుకోవడం అంటే చిన్న విషయమా.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus